చంద్రముఖి 2 టీవీలో ప్రసారమయ్యేది అప్పుడేనా…! ఇంతకి ఏ ఛానల్ లో అంటే….?

చంద్రముఖి 2 టీవీలో ప్రసారమయ్యేది అప్పుడేనా…! ఇంతకి ఏ ఛానల్ లో అంటే….?

by Mounika Singaluri

Ads

చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా తాజాగా చంద్రముఖి 2 సినిమా వచ్చింది. లారెన్స్, కంగనా రనౌత్ ప్రధానాపాత్రలు పోషించిన ఈ సినిమాకి చంద్రముఖి డైరెక్షన్ చేసిన పి.వాసు డైరెక్షన్ చేశారు. వడివేలు, రాధిక శరత్‍కుమార్, లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్, సృష్టి డంగే, సుభిక్ష కృష్ణన్, సురేశ్ చంద్ర, విఘ్నేష్ కీలకపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.

Video Advertisement

లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఎన్నో అంచనాలను నడుమ వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఓటిటి లో విడుదలైన కూడా అనుకున్న స్థాయి స్పందన రాలేదు. పైగా ఈ సినిమా భారీగా ట్రోల్స్ కి గురి అయింది.

అయితే ఇప్పుడు చంద్రముఖి 2 టీవీలో ప్రసారం కావడానికి సిద్ధమయింది.చంద్రముఖి-2 సినిమా తెలుగు వెర్షన్ జెమినీ ఛానెల్‍లో డిసెంబర్ 31 తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ తేదీపై ప్రకటన కూడా వచ్చేసింది. మరోవైపు, చంద్రముఖి-2 తమిళ వెర్షన్ సన్ టీవీ ఛానెల్‍లో జనవరి 1 (2024) సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం అవుతుంది.

అయితే థియేటర్ లో, ఓటిటి లోను ఫ్లాప్ అయినా ఈ చిత్రం టీవీలో ఏ మేరకు ఫలితం రాబడుతుందో వేచి చూడాలి. ఇక చంద్రముఖి 2 కధ విషయానికి వస్తే…చంద్రముఖి ఆత్మ తిరిగి రావడంతో వేటయ్యపాలెం ప్యాలెస్‍కు వచ్చే రాధికా శరత్‍కుమార్ కుటుంబంలో సమస్యలు ఎదురవడం, రాఘవ లారెన్స్ ఆ సమస్యను పరిష్కరించడం చుట్టూ చంద్రముఖి-2 చిత్రం కథ తిరుగుతుంది. చంద్రముఖి మళ్లీ ఎందుకు తిరిగి వచ్చింది.. చివరికి పరిష్కారం దొరికిందా అన్నదే చంద్రముఖి 2 ప్రధాన కథగా ఉంది


End of Article

You may also like