Ads
భారతదేశం అంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు.
Video Advertisement
ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు. ఈ ట్రైలర్ లో హీరోయిన్లు అలియా భట్, ఒలివియా మోరిస్ కూడా కొన్ని సీన్స్ లో కనిపిస్తారు. కానీ ఒలీవియా మోరిస్ పాత్రని ఎక్కువగా రివీల్ చేయలేదు. అలాగే శ్రియ శరన్, అజయ్ దేవగన్, సముద్రఖని వంటి నటుల్ని కూడా మనం ఈ ట్రైలర్ లో చూడచ్చు. ట్రైలర్ లో చూసిన చాలా షాట్స్ మనం అంతకముందు విడుదలైన టీజర్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోస్ లో చూసాం.
కానీ కొన్ని షాట్స్ మాత్రం మనకి అంతక ముందు చూపించిన వీడియోస్ లో వేరేగా ట్రైలర్ లో వేరేగా ఉన్నాయి. అందులో ఒక షాట్ ఇదే. ఇదే షాట్ ని మనకి అంతక ముందు ఎన్టీఆర్ కొమరం భీం వీడియోలో చూపించారు. కానీ ఆ షాట్ లో అప్పుడు కేవలం జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రమే చూపించారు.
ఇప్పుడు ఇందులో గ్రాఫిక్స్ తో పులిని కూడా యాడ్ చేసి చూపించారు. బహుశా మనం ట్రైలర్ లో ఈ షాట్ చూసి ఆశ్చర్యపోవాలి అనే ఉద్దేశంతోనే అంతక ముందు ఫుల్ లెన్త్ షాట్ చూపించలేదేమో. కానీ సినిమా బృందం అనుకున్నట్టుగానే ట్రైలర్ లో కొమరం భీం, పులి మధ్య ఈ సీన్ చూసి ప్రేక్షకులు చాలా ఎక్సైట్ అయ్యారు.
End of Article