Home Filmy Adda ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాలో… చేయబోతున్న 5 మార్పులు ఇవేనా..?

ప్రభాస్ “ఆదిపురుష్” సినిమాలో… చేయబోతున్న 5 మార్పులు ఇవేనా..?

by Mohana Priya

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే విడుదల అవుతోంది.

ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ అంతకుముందు తానాజీ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీజర్ లో ప్రభాస్ తో పాటు వీరు కూడా కనిపిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు అభినందిస్తున్నారు.

the man who acted as hanuman in aadipurush movie..

కానీ దీంతో పాటు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇందులో కొన్ని విషయాలు ప్రేక్షకులని నిరాశపరిచాయి. దాంతో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయబోతున్నారు. అందుకే సినిమా విడుదలకు కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాలు చేయబోతున్న మార్పులు ఇదే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

minus points in prabhas adipurush teaser

#1 ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన రాముడి పాత్ర, అలాగే రాముని సైన్యం విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ పాత్ర కానీ, ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కానీ చాలా బాగా వచ్చాయని సమాచారం. దాంతో ప్రభాస్ కి సంబంధించి ఏ సీన్ కూడా మళ్ళీ షూట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కేవలం ప్రభాస్ ఒక్కరే మాత్రం ఉన్న సీన్స్ అలాగే ఉంటాయి.

fans getting doubts about aadipurush result

#2 అయితే హనుమంతుడి పాత్రకు సంబంధించిన సీన్స్ మాత్రం మార్చాలి అని అనుకుంటున్నారట. అలాగే హనుమంతుడు సైన్యం, ఇంకా కొన్ని సీన్లు కూడా మార్చాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇది గ్రాఫిక్స్ లో మారుస్తారో, లేదా మళ్లీ షూట్ చేస్తారో అనేది మాత్రం తెలియదు.

the man who acted as hanuman in aadipurush movie..

#3 సినిమా టీజర్ విడుదల అయిన తరువాత సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణాసురుడి పాత్రపై కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. దాంతో అసలు సినిమా బృందం అంతా కూడా దృష్టి రావణాసురుడి పాత్ర మీద, అలాగే ఆ పాత్రకి సంబంధించి వచ్చే సన్నివేశాల మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పుడు రావణాసురుడు ఉన్న సీన్స్ అన్నీ మార్చాలి అని అనుకుంటున్నారు. దీని కోసం చాలా బడ్జెట్ కూడా ఖర్చు అవుతుంది.

minus points in prabhas adipurush teaser

#4 అంతే కాకుండా చాలా మంది మనం టీవీల్లో కానీ ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో కానీ పౌరాణిక పాత్రలని ఇలా చూడలేదు అని అన్నారు. దాంతో ఎక్కువగా కొత్తదనం ఏమీ ఉండాలి అని అనుకోకుండా ఇప్పటివరకు ఇన్ని దశాబ్దాల నుండి ప్రజలు సినిమాల్లో చూస్తున్న, అది కూడా రామాయణానికి సంబంధించిన పౌరాణిక పాత్రలు ఎలాగైతే ఉంటారో ఈ సినిమాలో కూడా అలాగే ఉండాలి అని అనుకుంటున్నారు అని, అప్పుడే సినిమా చూస్తున్న వారికి కూడా రామాయణానికి సంబంధించిన సినిమా చూస్తున్నాము అని అనిపిస్తుంది అని చాలా విషయాల్లో శ్రద్ధ తీసుకుంటున్నారట.

minus points in prabhas adipurush teaser

#5 అయితే రావణాసురుడి పాత్రలో మార్పులు చేస్తున్నారు కాబట్టి రావణాసురుడితో రాముడు ఉన్న సీన్లు కూడా మళ్ళీ రీ షూట్ చేయడం కానీ, గ్రాఫిక్స్ వర్క్ చేయడం కానీ చేస్తారు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన సీన్స్ కూడా సినిమా మొత్తంలో మారుస్తారు అని అంటున్నారు.

minus points in prabhas adipurush teaser

అయితే రాముడిగా ప్రభాస్ లుక్ కూడా కొంచెం మారిస్తే బాగుండేది అని చాలా మంది అన్నారు. కానీ మోషన్ క్యాప్చర్ కాబట్టి అందరూ అలాగే కనిపిస్తారు అని, ఇలా ఉన్నంత మాత్రాన యానిమేషన్ సినిమా కాదు అని, ఇది టీజర్ కాబట్టి అలా ఉంది అని, ఈ సినిమాలో చూసినప్పుడు చాలా బాగుంటుంది అని అంటున్నారు. దాంతో రాముడి లుక్ అలాగే ఉంటుంది అని అర్థం అవుతోంది.

minus points in prabhas adipurush teaser

సినిమా బృందం మాత్రం ప్రభాస్ లుక్ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభాస్ సాధారణంగా పౌరాణిక పాత్రలకు చాలా బాగా సరిపోతారు అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ సినిమాలో ముందు నుంచి కూడా ప్రభాస్ విషయంపై చాలా శ్రద్ధ వహించారు. దాంతో ఇప్పుడు ప్రభాస్ పాత్ర గురించి ఎటువంటి కామెంట్స్ వచ్చినా సరే దాదాపు ఏవి మార్చే అవకాశాలు అయితే లేవు అని అంటున్నారు. మరి మిగిలినవి అన్నీ మారుస్తున్నారు కాబట్టి ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పుడు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది అని అంటున్నారు.

You may also like