Home Filmy Adda లవ్ స్టోరీ “ఓటీటీ” వెర్షన్‌లో మార్పులు.? ఏ సీన్ లో అంటే.?

లవ్ స్టోరీ “ఓటీటీ” వెర్షన్‌లో మార్పులు.? ఏ సీన్ లో అంటే.?

by Mohana Priya

Ads

రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యి విజయం సాధించింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారు. ఇలాంటి అంశాలను తెరపై చూడటం మనకి కొంచెం కొత్తగా అనిపించింది. సినిమా విడుదల అయిన నెల రోజులకి ఆహాలో డిజిటల్ రిలీజ్ అయ్యింది. అయితే సినిమా థియేటర్లలో విడుదల అయినప్పుడు క్లైమాక్స్ గురించి చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. క్లైమాక్స్ లో హీరోని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళతారు. సినిమా అక్కడికి ఎండ్ అవుతుంది.

Video Advertisement

love story controversy

కానీ డిజిటల్ రిలీజ్‌లో మాత్రం క్లైమాక్స్ లో కొంచెం మార్పులు చేసినట్లు సమాచారం. హీరోని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ హీరో కోసం కోర్ట్ కి వెళ్తున్నట్టు, హీరో ఆ హత్య కావాలని చేయలేదు అని అతనిని నిర్దోషిగా కోర్ట్ ప్రకటించినట్టు డిజిటల్ రిలీజ్‌లో ఒక చిన్న సీన్ యాడ్ చేశారు. దాంతో ఈ సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. ఏదేమైనా థియేటర్లలో కూడా లవ్ స్టోరీ సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్ళింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా తక్కువ సినిమాలు ఇంత ప్రజాదరణ పొందాయి. వాటిలో లవ్ స్టోరీ కూడా ఒకటి.


End of Article

You may also like