ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పాన్ ఇండియన్ రేంజ్ స్టార్ డమ్ తెచ్చిన చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం అల్లు అర్జున్ లోని విభిన్న కోణాన్ని ప్రజలకు పరిచయం చేసింది. పక్క మాస్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటన అతనికి విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టింది.
ఒక టాలీవుడ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా అల్లు అర్జున్ పుష్ప మూవీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 2021 లో విడుదలైన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా రికార్డ్ సృష్టించింది.

ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప ది రూల్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెట్స్‌లో శరవేగంగా సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తతో నెట్లో వైరల్ అవుతూనే ఉంది. మే 2024 కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒడిస్సా లోని ఒక అటవీ ప్రాంతంలో జరుగుతుంది.

ఇంకా రెండవ పార్ట్ విడుదల కాకముందే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మూడవ పార్ట్ కూడా ఉంటుంది అన్న న్యూస్ వైరల్ అయింది. ఈ మూవీకి సంబంధించిన త్రీక్వెల్ స్క్రిప్ట్‌ను సుకుమార్ రెడీ చేసినట్టు ఆన్లైన్లో తెగ గాసిప్ నడుస్తోంది. ఈ భాగానికి పుష్ప 3: ది రూల్ బిగిన్స్ అనే పేరు కూడా పెట్టారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు పుష్పాలో విలన్ క్యారెక్టర్ చేసిన ఫహద్ ఫాసిల్ ఈ చిత్రానికి థర్డ్ పార్ట్ ఉంటుంది అని చెప్పిన విషయాన్ని తిరిగి గుర్తు చేస్తున్నారు.

కేజిఎఫ్ లాగా ఈ మూవీకి కూడా మూడు పార్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని అభిమానులు ఆనందిస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎన్నో మూవీస్ కు సీక్వెల్ వచ్చింది కానీ ఈ గాసిప్ నిజమైతే మొదటిసారి త్రీక్వెల్ వచ్చిన మూవీగా పుష్ప మరొక రికార్డును సృష్టిస్తుంది. విడుదలకు ముందే వైరల్ అవుతున్న ఈ చిత్రం రెండవ భాగం మొదటి దానికంటే ఎక్కువ సక్సెస్‌ను అందుకుంటుంది అని అందరూ ఆశిస్తున్నారు.
Major changes #PusphaTheRule #Sukumar made changes in the script and extended the duration of the characters to take them next part#Pushpa 3
"The Rule Begins"
Assalu #ThaggedheLe 🪓🪵🛖#AlluArjun #RashmikaMandanna— RR💥 (@rrking99) July 18, 2023
