Ads
ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన యాప్ టిక్ టాక్.చిన్న ,పెద్ద,మహిళలు అందరూ ఈ యాప్ ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.కొన్ని వివాదాస్పదమైన వీడియోలను సైతం చేసి జైళ్ల పలు అయినవారు ఉన్నారు.అయితే చనిపోతే ఎలా ఉంటుంది అని పురుగుల మందు తాగుతూ ఒక టిక్ టాక్ వీడియో చేసాడు ఓ యువకుడు.ఆ ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే …
Video Advertisement
తుమకూరు జిల్లాలోని కొరటిగెరె ప్రాంతంలో ఓ విషాదం చోటు చేసుకుంది.చనిపోతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ వీడియో గా చేయాలనుకుంటాడు ఓ యువకుడు..దానికోసం పొలాల్లో పురుగులు చనిపోవడానికి వాడే మందును తాగుతూ వీడియో చేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు ఆ యువకుడు.అయితే ఆ యువకుడు పురుగుల మందు తాగాడు అనే విషయం గ్రహించిన కుటుంబ సభ్యులు అతనిని వెంటనే ఆసుపత్రి కి తరలించారు.
అయితే ఆసుపత్రికి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ యువకుడు.అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు.అయినా ఈ మధ్య టిక్ టాక్ వీడియోస్ చేసేవారు మరి హద్దులు దాటుతున్నారని కాగా చనిపోతే ఎలా ఉంటుందో అనే వీడియో చెయ్యాలనే ఆలోచన రావడం మరి దారుణం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
End of Article