కరోనా అనేది ఒక వైరస్. అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకేది. కానీ ఆ వైరస్ పక్క వ్యక్తికి సోకేది కరోనా వచ్చిన వ్యక్తి బతికున్నంత వరకు మాత్రమే. చనిపోయిన 4 గంటల తర్వాత కరోనా మరొక వ్యక్తికి సోకే అవకాశం ఉండదట. కరోనా సోకీ చనిపోయిన వ్యక్తి శరీర దహనం అయిన తర్వాత అవశేషాలు ఏమీ మిగలవు. సాఫ్ట్ టిష్యూ లో బాక్టీరియా ఉంటుందట కానీ వైరస్ ఉండదట. ఇంకా దహనం చేసిన శరీరం ఎముకలుగా మారేంత వరకు అయితే వైరస్ అసలు ఉండదట.

Video Advertisement

ఒకవేళ కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వ్యక్తిని దహనం చేస్తే ఆ పొగ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పాకుతుంది అనే అపోహ మాత్రమే. ఇలాంటి దుష్ప్రచారాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి దాంతో డాక్టర్లు తెలిసీ తెలియకుండా ఇలాంటి విషయాలని ఎక్కడా మాట్లాడొద్దు అని చెప్తున్నారు.

చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి చూడొచ్చు. కానీ ఆ వ్యక్తి మీద పడడం లేదా భావోద్వేగంలో ఆ వ్యక్తిని తాకడం లాంటివి చేయొద్దు. చనిపోయిన వ్యక్తికి హాస్పటల్ లోనే డ్రెస్సింగ్ చేసి శరీరాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారట. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదట. కానీ చనిపోయే వ్యక్తిని ముట్టుకున్న కాటికాపరులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలట.

హిందూ ధర్మం ప్రకారం దహనం చేసిన తర్వాత ఆ వ్యక్తి అవశేషాలు తీసుకుంటారు. అదేవిధంగా ఒకవేళ కరోనా వచ్చి చనిపోయిన వ్యక్తిని దహనం చేసిన తర్వాత కూడా అవశేషాలు తీసుకోవచ్చు. అలాగే ఆ వ్యక్తి యొక్క దహనం చేసిన తర్వాత వచ్చే బూడిద కూడా తీసుకోవచ్చట. కాకపోతే గ్లౌజులు మాత్రం కచ్చితంగా వేసుకోవాలట.

ఇలాంటివి ఇంకా ఎన్నో దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, సోషల్ మీడియా, ఇంకా టీవీ చానళ్ల మాధ్యమం ద్వారా ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారం ఆపేలా చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. ఒక వ్యక్తి కరోనా వైరస్ సోకి చనిపోయినా కూడా ఆ వ్యక్తి కూడా ఒక మనిషే.

కాబట్టి ప్రాణం విడిచిన వ్యక్తికి ఏ విధంగా అయితే అన్ని మర్యాదలతో దహనసంస్కారాలు చేస్తారో అదే విధంగా కరోనా వచ్చి చనిపోయిన వ్యక్తికి కూడా దహన సంస్కారాలు అన్ని పద్ధతులు పాటిస్తూ చేయాలి అని, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు.