నటి “హేమ” కూతుర్ని ఎప్పుడైనా చూసారా.? వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూస్తే హీరోయిన్ అనాల్సిందే.!

నటి “హేమ” కూతుర్ని ఎప్పుడైనా చూసారా.? వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూస్తే హీరోయిన్ అనాల్సిందే.!

by Mohana Priya

Ads

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు హేమ. హేమ అసలు పేరు కృష్ణవేణి. హేమ ఈస్ట్ గోదావరిలోని రాజోలులో పుట్టారు. ఏడో తరగతి వరకు చదివిన తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశారు. చిన్నప్పటి నుంచే హేమకి సినిమాలంటే ఆసక్తి ఉండేది. 1989 లో వచ్చిన చిన్నారి స్నేహం సినిమాలో నటించారు హేమ.

Video Advertisement

తర్వాత కొడుకు దిద్దిన కాపురం, స్వాతి చినుకులు, ముద్దుల మావయ్య, పల్నాటి రుద్రయ్య, ధర్మ యుద్ధం, వింత దొంగలు, అయ్యప్ప స్వామి మహత్యం, జయమ్ము నిశ్చయమ్మురా, అగ్గి రాముడు, చెవిలో పువ్వు, లారీ డ్రైవర్, రౌడీ గారి పెళ్ళాం, క్షణక్షణం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు హేమ.

హేమ, సయ్యద్ జాన్ అహ్మద్ ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కొంత కాలం విరామం తీసుకున్నారు హేమ. 2001 లో వచ్చిన మురారి సినిమా లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తర్వాత ఎన్నో సినిమాల్లో చేశారు హేమ. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఇటీవల విడుదలైన డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ బొంభాట్ సినిమాలో కూడా కనిపించారు హేమ.

అంతే కాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. హేమ దంపతులకు ఒక కూతురు ఉన్నారు. తన పేరు ఈషా. ఇటీవల ఈషా 19వ పుట్టిన రోజు జరిగింది. ఈషా బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#1

#2 #3 #4 #5 #6 #7 #8


End of Article

You may also like