Home Bigg Boss 5 telugu బిగ్ బాస్ ఫేమ్ “ఉమాదేవి” కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

బిగ్ బాస్ ఫేమ్ “ఉమాదేవి” కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

by Megha Varna

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇటీవలే నటి ఉమాదేవి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఉమాదేవి యూట్యూబ్ వీడియోలు, ఈవెంట్లు వంటి వాటిని చేస్తున్నారు. ఇలా ఈమె బాగానే సంపాదిస్తున్నారు.

ఇప్పుడు ఆమెకి వస్తున్న ఆఫర్లు, ఆమె ఉన్న పరిస్థితి గతంలో ఉండి ఉంటే ఈపాటికి ఆమె చాలా క్రేజ్ పొందేవారు. అలానే మంచి హోదాలో కూడా ఉండేవారు. కార్తీకదీపం సీరియల్ లో హీరోయిన్ దీప బంధు పాత్రలో నటించి ఉమాదేవి మెప్పిస్తున్నారు.

ఒకప్పుడు ఆమెకి పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు తన కెరీర్ ని దెబ్బతీస్తాయి. ఏది ఏమైనప్పటికీ మంచి ట్యాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలు అవే వస్తాయి. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికీ తమ యొక్క ట్యాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది.

Telugu Character Artist Uma Devi Daughter Tanusha Yaganti Tollywood Big Boss Contestants Kartheeka Depam Serial --TeluguStop

ఇదిలా ఉంటే ఉమాదేవి తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ హల్చల్ చేస్తోంది. ఉమాదేవి కూతురు పేరు యాగంటి తనూష. ఈమె తన చదువును పూర్తి చేసుకుని డాన్స్ రంగంలో ఆసక్తి ఉండడం వలన శిక్షణ తీసుకుంటోంది.

Uma Devi (Appala Maria) Bigg Boss Telugu Season 5 Wiki, Age, Boy friend,Husband Relationship, Family, Biography & More

ఉమా దేవి తన కూతురు తో అప్పుడప్పుడు వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తనూష అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాని దాదాపు ఐదు వేల పైచిలుకు మంది అనుసరిస్తున్నారు. పైగా ఆ ఫోటోలు చూసి హీరోయిన్ గా అవకాశాలు వస్తాయి. ట్రై చేయమని కామెంట్లు కూడా చేస్తున్నారు. తన తల్లి లాగ తనూష కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

You may also like