Home Filmy Adda సినిమాల్లో మనకి కనిపించని 10 అపరిచిత క్యారెక్టర్లు…కొంతమంది కేవలం వినిపిస్తారు అంతే.!

సినిమాల్లో మనకి కనిపించని 10 అపరిచిత క్యారెక్టర్లు…కొంతమంది కేవలం వినిపిస్తారు అంతే.!

by Mohana Priya

సినిమాలో మెన్షన్ చేసే ప్రతి పాత్ర కనిపించాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల్లో కొన్ని పాత్రల పేర్లు మెన్షన్ చేస్తారు అలాగే వాళ్ళ గొంతులు వినిపిస్తాయి కానీ వాళ్లు మాత్రం కనిపించరు. అలా అలా మన సినిమాల్లో వాళ్ల గురించి ప్రస్తావించినా కానీ తెరపై కనిపించకుండా ఉన్న పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 సువర్ణ – జాతి రత్నాలు

రాహుల్ రామకృష్ణ పాత్ర సువర్ణ తో సినిమా మొత్తం మాట్లాడతాడు. కానీ సువర్ణ ఎవరో మనకి చూపించరు.

Jathi ratnalu movie in a nutshell

#2 బల్లాల దేవ భార్య – బాహుబలి

బాహుబలి సినిమాలో బల్లాల దేవ భార్య, అడవి శేష్ తల్లి ఎవరో మనకి చూపించరు.

Characters that were mentioned but not seen in the movie

#3 సురేఖ వాణి భర్త – బొమ్మరిల్లు

బొమ్మరిల్లు సినిమాలో సురేఖ వాణి పాత్ర ఫోన్ లో తన భర్తతో మాట్లాడుతూ ఉంటారు. కానీ తన భర్త ఎవరో మనకి ఒకసారి కూడా సినిమాలో చూపించరు.

Characters that were mentioned but not seen in the movie

#4 జాను భర్త – జాను

జాను సినిమాలో తన భర్త పాత్ర పేరు చెప్తుంది కానీ ఆయన ఎవరో మనకి చూపించరు.

Characters that were mentioned but not seen in the movie

#5 ఐదు పాత్రలు – గ్యాంగ్ లీడర్

గ్యాంగ్ లీడర్ సినిమా మొత్తం ఒక 5 పాత్రలకు సంబంధించిన ఐదుగురు మహిళలు చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రల గురించి మనకు చెబుతారు. కానీ వాళ్ళు ఎవరో మనకు సరిగ్గా చూపించరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కనిపిస్తారు. కానీ వాళ్ల మొహాలు క్లియర్ గా కనిపించవు.

Characters that were mentioned but not seen in the movie

#6 స్వర్ణ పుష్పం – రఘువరన్ బీటెక్

రఘువరన్ బీటెక్ సినిమాలో వివేక్ గారు తన భార్య స్వర్ణ పుష్పం తో మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ గొంతు మనకు వినిపిస్తుంది కానీ ఆవిడ ఎవరో మనకు చూపించలేదు.

Characters that were mentioned but not seen in the movie

#7 సునీల్ వాళ్ళ అన్నయ్య – మన్మధుడు

సోనాలి బింద్రే చేసుకోబోయే అతని తమ్ముడు అయిన సునీల్ పాత్ర మనకు చూపించారు. కానీ అసలు సునీల్ అన్న పాత్ర ఎవరో మనకి చూపించలేదు.

Characters that were mentioned but not seen in the movie

#8 అరుంధతి భర్త – అరుంధతి

అరుంధతి సినిమాలో అనుష్క కి పెళ్లి అయినట్లు చూపిస్తారు కానీ తన భర్త ఎవరో మనకు చూపించలేదు.

Characters that were mentioned but not seen in the movie

#9. నివేదా థామస్ బాయ్ ఫ్రెండ్ – వకీల్ సాబ్

vakeelsab

#10. నాగార్జున తల్లి – నువ్వొస్తావనీ

“నువ్వొస్తావనీ” సినిమాలో నాగార్జునకు తల్లి ఉంటుంది. మనీ ఆర్డర్ పంపిస్తూ ఉంటుంది. తన తల్లి కళ్ళనే హీరోయిన్ కి కూడా పెడతారు. కానీ ఆ తల్లి ఎవరు అనేది సినిమాలో ఎక్కడ చూపించలేదు.

కేవలం వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల గురించి చెప్తారు. కొన్ని సినిమాల్లో అయితే వాళ్ళ గొంతు కూడా వినిపిస్తాయి. కానీ వాళ్ళు ఎవరో మనకి చూపించలేదు.

You may also like