Ads
దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇవాళ 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు పూరీ జగన్నాధ్ కి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. పూరీ జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో నడుస్తోంది. దాంతో పూరీ జగన్నాధ్ టీం మొత్తం ఆయనకి గోవాలో బర్త్ డే సప్రైజ్ ఇచ్చారు.
Video Advertisement
అయితే, పూరీ జగన్నాధ్ కి వచ్చిన సెలబ్రిటీ విషెస్ అన్నిటికీ ఛార్మీ సమాధానం ఇస్తున్నారు. ట్విట్టర్ ద్వారా పూరీ జగన్నాధ్ కి విషెస్ తెలిపిన సెలబ్రిటీలకు ఛార్మీ ట్విట్టర్ ఎకౌంట్ నుండి రిప్లైలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఏంటంటే, పూరీ జగన్నాధ్ గత కొంత కాలం నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయమై పూరీ జగన్నాధ్ తన చివరి పోస్ట్‌లో, “కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నాను” అని చెప్పారు. దాంతో పూరీ జగన్నాధ్ కి బర్త్ డే విషెస్ అందించిన సెలబ్రిటీలు అందరికీ పూరీ కనెక్ట్స్ కో-ప్రొడ్యుసర్ అయిన ఛార్మీ రిప్లై ఇస్తున్నారు
End of Article