మనుషులు చనిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం?

మనుషులు చనిపోతుంటే నీకు నవ్వులాటగా ఉందా? ఇప్పుడు సారీ చెప్పి ఏం లాభం?

by Sainath Gopi

Ads

కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. మన దేశంలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాదు ఢిల్లీలో మరో వ్యక్తికి కూడా కరోనావైరస్ వచ్చిందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. ప్రస్తుతం వారిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స కొనసాగిస్తున్నారు.

Video Advertisement

ఇది ఇలా ఉంటే…ఒక పక్క మనుషులు చస్తుంటే నటి ఛార్మి ఎలాంటి వీడియో పోస్ట్ చేసిందో చూడండి. ‘కరోనా ఢిల్లీ, తెలంగాణలకు వచ్చిందట.. ఆల్ ద బెస్ట్’ అని నవ్వుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జనం ఒకపక్క చస్తుంటే కనీస మానవత్వం లేకుండా కరోనాకు వెల్కమ్ చెబుతావా అని ఆమెపై తిట్ల వర్షానికి లంకించుకున్నారు. ఆపదలో ఉన్నవారికి చేతనైతే సాయం చేయాలని, ఇలా వెక్కరించకూడదని హితవు పలికారు.

దీంతో ఛార్మి వెంటనే ఆ వీడియో డిలీట్ చేసింది. అయితే అప్పటికే నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవ్వడంతో సమాధానంగా మరో ట్వీట్‌ చేసింది. ‘నేను ఇలాంటి సందర్భంలో అలాంటి వీడియో పోస్ట్‌ చేయడం తప్పు. మీరు చేసిన కామెంట్స్‌ అన్నీ చదివాను. ఇది చాలా సున్నితమైన అంశం అని నేను భావించలేకపోయాను. ఈ చర్య పట్ల నేను క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావు’ అంటూ ట్వీట్‌ చేసింది.

‘కరోనా’ను నియంత్రించేందుకు వైద్యులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రపంచ జనాభా అంతా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘కరోనా’పై నటి ఛార్మి సోషల్ మీడియా టిక్ టాక్‌లో ఆ వీడియో పోస్ట్ చేయడం మాత్రం అస్సలు మానవత్వం కాదు. “ఆ వీడియో పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోస్టయిన అన్ని కామెంట్లు చదివాను. ఎంతో సున్నితమైన అంశంపై పరిణతి లేకుండా స్పందించినందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. ఇకపై ఇలాంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తాను” అంటూ ట్వీట్ చేసింది.


End of Article

You may also like