Ads
ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు. కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది.
ఇదిలా ఉండగా దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ఛార్మి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం ఛార్మి స్మైలీ ఎమోజిలతో ఒక ట్వీట్ షేర్ చేశారు. అయితే దానికి కారణం ఇదే అని కొంత మంది నెటిజన్లు అన్నారు. అదేంటంటే చిరంజీవి 150 వ సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా తెరపైకి వెళ్లలేదు.
అదే సమయంలో చిరంజీవి రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించారు. ఈ సినిమా విడుదల అయిన రోజు నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. అదే విషయంపై ఛార్మి ఇలా స్పందించారు అని కామెంట్స్ వచ్చాయి. అంటే ఛార్మి ట్వీట్ చేసిన రోజు, ఈ సినిమా విడుదల అయిన రోజు ఒకటే కావడంతో ఇలాంటి కామెంట్స్ అయితే వచ్చాయి. అంతేకాకుండా మెహబూబా సినిమా సమయంలో కూడా ఇదే ట్వీట్ కి చాలామంది రిప్లై ఇస్తూ కామెంట్ చేశారు.
ఇప్పుడు అదే కామెంట్ కి నెటిజన్లు రిప్లై ఇస్తూ ఇప్పుడు ఈ లైగర్ సినిమా కూడా అలాగే నెగిటివ్ టాక్ వచ్చింది అని అంటున్నారు.
End of Article