తిరుమల నడక దారిలో చిన్నారి లక్షిత చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయినప్పటి నుండి తిరుమలకు నడక దారిలో వెళ్ళే భక్తులను చిరుత భయం వెంటాడుతోంది. అటవీశాఖ అధికారులు నడక దారిలో ఆపరేషన్ చిరుతను  కొనసాగిస్తున్నారు.

Video Advertisement

ఒక చిరుత బోనులో చిక్కిందని అనుకునే లోపు. మరొక చిరుత నడక మార్గంలో సంచరించడం భక్తులను మరింతగా భయపెడుతోంది. ఇప్పటివరకు ఐదు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. తాజాగా మరోక చిరుత కూడా  బోనులో చిక్కినట్టు తెల్సుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తిరుమల నడక దారిలో పలు చోట్ల అమర్చిన కెమెరాల సహాయంతో చిరుతల కదలికల్ని అధికారులు గమనిస్తూ ఉన్నారు. చిరుతలను పట్టుకోవడం కోసం పలు చోట్ల ట్రాప్ ఏర్పాటు చేశారు. అలా ఐదు చిరుతలను  పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో చిరుత పులి, అలిపిరి నడక దారిలో లక్ష్మీ నరసింహా స్వామి గుడి,  2,850వ మెట్టు వద్ద చిన్నారి లక్షిత పై దాడి చేసిన స్థలంలోనే చిక్కినట్టు తెలుస్తోంది. అధికారులు రెండున్నర నెలల్లో ఆరు చిరుతలను పట్టుకున్నారు.
ఈ చిరుత పులిని కూడా తిరుపతి జూకు తరలించారు. గత వారం రోజులుగా ఈ చిరుత కదలికలను కెమెరాల ద్వారా గమనిస్తూ ట్రాప్ చేశామని అటవీశాఖ ఆఫీసర్లు తెలిపారు. ఈ చిరుతతో ఇప్పటివరకు మొత్తం 6 చిరుతల్ని బంధించారు. వీటిని తిరుపతి జూకు అటవీశాఖ ఆఫీసర్లు తరలించారు. అయితే 3 చిరుతల్ని అధికారులు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం జూలో 3 చిరుతలు ఉన్నాయని తెలుస్తోంది. తిరుమల నడక దారిలోనే కాకుండా, చిరుత సంచారం తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కనిపించడం కలకలం సృష్టించింది. సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో ఘాట్ రోడ్డులో భక్తులు చిరుతను చూసి వణికిపోయారు. వెంటనే వారు టీటీడీ ఆఫీసర్లకు సమాచారం అందించారు. ఇక ఎస్వీ యూనివర్శిటీలో చిరుత కనిపించింది. దానిని సీసీ కెమెరా ద్వారా గుర్తించారు.

Also Read: బిల్లు కట్టడానికి డబ్బులు లేవు… చివరికి..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!