Ads
నిన్న యూట్యూబ్ లో విడుదలైన ఓ వీడియోలోని ఓ చిన్న బిట్ సోషల్ మీడియా అంతా తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ వీడియో కథేంటో ఇప్పుడు చూద్దాం.తెలుగువారికి సుపరిచితుడైన ప్రముఖ చెఫ్ తుమ్మ సంజయ్ గతంలో జీటివిలో వారేవా అనే షో చేశారు.ఇందులో సంజయ్ పక్క హైదరాబాదీ శైలిలో మాట్లాడుతూ అలరించడం వల్లే ఆ షో పెద్ద హిట్ అయ్యింది.
Video Advertisement
అయితే తాజాగా ఈయన చెఫ్ ఆయన తన భార్య రాగిణితో కలిసి స్నాక్స్ తయారు చేశాడు.ఆ వీడియోలో స్నాక్స్ తో కలిసి భార్య భర్తలిద్దరూ చుక్క కూడా ఏసారు.దానితో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో సంజయ్ నేను తాగేది సంవత్సరానికి 6,7 సార్లు అందులో నా భార్యతో కలిసి నాలుగు సార్లు తాగుతాను.మా నాన్న చెప్పాడు మన ఆనందాన్ని మన కష్టాన్ని పంచుకునే భార్యతో సెలబ్రేట్ చేసుకోవాలని అందుకే తనతో కలిసి తాగుతాను అని అన్నాడు.
ఇంతలో ఆయన భార్య రాగిణి ఈయనను నార్మల్ గానే పెట్టలేం.ఇక తాగితే అసలు తట్టుకోలేం అంటూ చక్కని పంచ్ వేశారు.మరి ఈ వీడియో పై మీరు ఓ లుక్ వేయండి. ఇలా నిర్మొహమాటంగా సంజయ్ చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. అందుకే ఆ వీడియో అంత వైరల్ అయ్యింది.
watch video:
End of Article