Ads
కరోనా ఎంతగా అయితే ప్రపంచమంతటా విజృంభించిందో అదే స్థాయిలో మానవత్వం కూడా వెల్లువిరిస్తుంది .ఇప్పటికే కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్త్వాల నిర్ణయాలతో దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..ఈ నేపథ్యంలో కరోనా బారి నుండి దేశాన్ని కాపాడేందుకు ఆర్ధికంగా బలం చేకూర్చేందుకు బడా వ్యాపారవేత్తల నుండి సెలెబ్రెటీ ల వరుకు ,సెలెబ్రెటీ ల నుండి సాధారణ రైతుల వరుకు ఎవరికీ చేతనైనంతలో వారు పీఎం కేర్ ఫండ్ కు విరివిగా విరాళాలిస్తున్నారు .ఈ విపత్కర పరిస్థితులలో బియ్యం కూరగాయలు మరియు భోజన ప్యాకెట్లు అవసరమైన వారికీ అందించి మానవత్వాన్ని చాటుతున్నారు .
Video Advertisement
సెలెబ్రెటీల భార్యలు, తల్లులు సైతం మాస్క్ లు కుట్టి పంపిణి చేసి సమాజం మీద వారి బాధ్యతను చాటుతున్నారు.డాక్టర్లు ,నర్స్ లు ,పోలీస్ లు మరియు అత్యవసర సిబ్బంది ఇంటికి కూడా వెళ్లకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కరోనా పై యుద్ధం చేస్తూ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారు ,ఈ నేపథ్యంలో ఓ క్యాబ్ డ్రైవర్ తన పెద్ద మనసుతో చేసిన ఒక పని అందరి మన్ననలు పొందేలా చేసింది ..వివరాల్లోకి వెళ్తే …
మహ్మద్ సైదుల్ లష్కర్.. బెంగాల్‌కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తన చెల్లి కోసం.. నాలుగు ట్యాక్సీలు, భార్య బంగారు నగలు అమ్మి ఓ హాస్పిటల్ నిర్మించాడు .ఇప్పుడు కరోనా బారిన పడి క్లిష్ట పరిస్థితులలో ఉన్న బెంగాల్ కు 50 పడకల సామర్ధ్యం గాల ఆ ఆసుపత్రిని క్వారంటైన్ సెంటర్ గా మార్చేందుకు ప్రభుత్త్వానికి ఇచ్చేందుకు నిర్ణయిచుకున్నాడు . 2004 లో సైదుల్ లష్కర్ సోదరి మరుఫా న్యుమోనియాతో చనిపోయింది .దీంతో తన చెల్లిలాగా ఎవరికీ కాకూడదనే ఆశయంతో తన నాలుగు టాక్సీలు ,భార్య నగలు అమ్మి ..తాను సొంత స్థలంలో 50 పడకల ఆసుపత్రి నిర్మించాడు ..బరువిపూర్ జిల్లా పున్రి గ్రామంలో ఈ హాస్పిటల్ నిర్మించాడు. రోజు ఇక్కడ 300 మంది వరకూ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు .
‘‘నా చెల్లెలికి గుర్తుగా నేను ఎప్పుడో కొన్న స్థలంలో ఈ హాస్పిటల్ కట్టా. ఇందుకోసం నా భార్యా, నేను తిండి కూడా తినకుండా డబ్బులు కూడబెట్టాం. ప్రతి ఇటుకను దగ్గరుండి మరీ మేమే కట్టించాం. కానీ కరోనా బారిన పడిన దేశ ప్రజలకు నా వంతు సహాయం చేయాలని భావించాను. అందుకే ప్రభుత్వానికి అవసరమైతే క్వారంటైన్ సెంటర్‌గా మార్చేందుకు మా హాస్పిటల్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం”అని లష్కర్ చెప్పాడు.
ఈరోజుకు కూడా లష్కర్ ఆ ఆసుపత్రికి అధునాతన వైద్య పరికరాలు కోసం నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు ..అయితే కరోనా నేపథ్యంలో తన ప్రయత్నాలను తాత్కాలికంగా వాయిదా వేశాడు. “నా భార్య, స్నేహితులు, బంధువులతో చర్చించిన తర్వాత నా హాస్పిటల్‌ను క్వారంటైన్ సెంటర్‌గా మార్చాలని జిల్లా అధికారులను కలిశాను. ఈ ప్రతిపాదనను హెల్త్ డిపార్ట్మెంట్కు, సీఎంవోకు పంపుతామని వారు చెప్పారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది” అని తెలిపాడు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ కు ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చాడు లష్కర్ .తన ఆసుపత్రిలోని పధి మంది ఎంప్లాయిస్ కు కరోనా కేసులను హ్యాండిల్ చేయడంపై శిక్షణ ఇస్తామని లష్కర్ తెలిపారు ..
Note: Images shown are just for representative purpose but not the actual characters
End of Article