దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంతమందిని కదిలించిందో అందరికి తెలిసిందే. ఆ ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.అందులో పోలీసులని హీరో గా చూపించబోతున్నాడు అంట. ఇప్పటికే సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆ ఘటన ఎలా జరిగి ఉంటుంది అనే కోణంలో తన బుర్రకి వర్మ పని పెట్టాడు.దానికి సంబంధించి పోస్టులు కూడా పెట్టాడు వర్మ.

Video Advertisement

అంతేకాకుండా నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశాడు వర్మ. రేణుక, చెన్నకేశవులును 16ఏళ్లకే పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు ఆమె 17ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. చెన్నకేశవులు దిశతోపాటు.. రేణుకను కూడా భాదితులురాలిగా మార్చడంటూ తెలిపాడు. అతను చేసిన పనికి రేణుకతోపాటు, అతని బిడ్డకు కూడా భవిష్యత్ లేకుండా పోయిందన్నారు.

రేణుకకి బ్లాంక్ చెక్ ఇచ్చి ఆమెకి కావాల్సినంత రాసుకోమని ఆమె జీవితానికి కావాల్సిన భరోసాకి ఆర్ధిక సాయం చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటివరకు మనం రామ్ గోపాల్ వర్మలో చూడని మరోకోణంని చూస్తున్నాము. ఇక సినిమా ఎలా తీస్తాడో వేచి చూడాలి. అంతేకాదు రేణుక తనకు పుట్టబోయే బిడ్డకు దిశ అని పేరు పెడుతుంది అంట.