Ads
కరోనా ప్రభావం వల్ల మొదట్లో చికెన్ తినేందుకే భయపడ్డ ప్రజలు ఇప్పుడు చికెన్‌ను తెగ లాగించేస్తున్నారు. గతంలో వారానికి ఒకసారి మాత్రమే చికెన్ తిన్న జనాలు.. ఇప్పుడు వారంలో 2, 3 సార్లు తింటున్నారు. లాక్‌డౌన్ ఆరంభంలో భారీగా పడిపోయిన చికెన్ అమ్మకాలు.. ఇప్పుడు మూడింతలు పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు నిత్యం కొన్ని వేల టన్నుల చికెన్‌ను ఆబగా ఆరగించేస్తున్నారట!
Video Advertisement
స్టార్టింగ్ లో చికెన్ తింటే కరోనా వస్తుందేమోనని భయంతో దాని వినియోగం తగ్గింది .కేజీ చికెన్ కేవలం రూ.30కే అమ్ముడైంది.కొన్ని చోట్ల ఫ్రీగా కూడా పంచేశారు! అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. చికెన్ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతుండడంతో జనాలు ఎక్కువగా చికెన్ తినడం మొదలు పెట్టారు. దీంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.180 నుంచి రూ.240 వరకు పలుకుతోంది.
ఇప్పుడు ఈ లాక్‌డౌన్‌లో మన వాళ్ళు తిన్న చికెన్ లెక్కలు చూద్దాం:
2019 లో ఇండియా లో చికెన్ వినియోగం –380 కోట్ల కిలోలు . రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రోజూ 10వేల టన్నుల సేల్ జరిగేది ….మార్చ్ లో సేల్స్ తగ్గినప్పటికి.. ఏప్రిల్ మే లో పుంజుకొని …గతంలో కంటే డబుల్ …అంటే రోజుకు 20 -25 వేల టన్నుల చికెన్ సేల్ అవుతుందట.! కానీ పౌల్ట్రీ పరిశ్రమల వారు కోళ్లకు ఫీడ్ లభ్యం కాకపోవడంతో డిమాండ్ మేరకు సప్లై అందించలేకపోతున్నారు. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక.. ప్రస్తుతం చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ముందు ముందు ఆంక్షలను మరింత సడలిస్తే చికెన్ ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.
End of Article