“సూర్యవంశం” సినిమాలో నటించిన ఈ అబ్బాయి గుర్తున్నాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

“సూర్యవంశం” సినిమాలో నటించిన ఈ అబ్బాయి గుర్తున్నాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

by Mohana Priya

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్నప్పుడే పేరు తెచ్చుకున్న నటులలో ఆనంద వర్ధన్ ఒకరు. తెలుగులో దాదాపు 20 కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆనంద వర్ధన్. ఆనంద వర్ధన్ ప్రముఖ గాయకులు పి.బి. శ్రీనివాస్ గారి మనవడు.    పి.బి. శ్రీనివాస్ గారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ తో పాటు తుళు, కొంకణి భాషల్లో కూడా పాడారు. ప్రముఖ కన్నడ నటులు రాజ్ కుమార్ గారికి ఎన్నో సినిమాల్లో దాదాపు మూడు వందల వరకు పాటలు పాడారు పి.బి. శ్రీనివాస్ గారు. ఆనంద వర్ధన్ తండ్రి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అట.

Video Advertisement

తనకి నాలుగేళ్ళ వయసున్నప్పుడు రామాయణం సినిమాలో నటించారు ఆనంద వర్ధన్. ఆనంద వర్ధన్ రామాయణం సినిమాలో వాల్మీకి ఇంకా హనుమాన్ పాత్రలను పోషించారట.

1997లో వచ్చిన జగపతి బాబు సౌందర్య నటించిన ప్రియరాగాలు సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ఆనంద వర్ధన్. ఆ తర్వాత ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, పెళ్లి పీటలు, తిరుమల తిరుపతి వెంకటేశ, శ్రీ మంజునాథ, మనసంతా నువ్వే, తొలిచూపులోనే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

1997లో ప్రియరాగాలు చిత్రంలో తన నటనకి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు ఆనంద వర్ధన్. అంతే కాకుండా సూర్యవంశం హిందీ లో అమితాబ్ బచ్చన్ హీరోగా అదే పేరుతో రీమేక్ అయింది.

ఈ సినిమాలో కూడా ఆనంద వర్ధన్ తెలుగులో పోషించిన పాత్రను పోషించారు. అలాగే శ్రీ మంజునాథ కన్నడ చిత్రం. అలా తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, కన్నడ భాషల్లో కూడా నటించారు ఆనంద వర్ధన్.

హైదరాబాద్ లోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆనంద వర్ధన్ త్వరలోనే హీరోగా మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. అందుకోసం నటన, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో  కూడా శిక్షణ తీసుకున్నారట ఆనంద వర్ధన్.


End of Article

You may also like