నానిలో ఈ “చైల్డ్ ఆర్టిస్ట్” గుర్తున్నాడా..? ఇప్పుడు ఈ అబ్బాయి హీరోగా నటించిన సినిమా ఏదో తెలుసా..?

నానిలో ఈ “చైల్డ్ ఆర్టిస్ట్” గుర్తున్నాడా..? ఇప్పుడు ఈ అబ్బాయి హీరోగా నటించిన సినిమా ఏదో తెలుసా..?

by Mohana Priya

Ads

చిన్నప్పుడు తమ సినిమా కెరీర్‌ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.

Video Advertisement

అలా మరో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు హీరో అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా నాని. బాక్సాఫీస్ వద్ద నాని ఫ్లాప్ అయినా కానీ మహేష్ బాబు కెరీర్‌లో ఒక ప్రయోగాత్మక సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ఎస్‌జె సూర్య దర్శకత్వం వహించారు. అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.

child artist in nani now became a hero

ఇందులో హీరో చిన్నప్పటి ఫ్రెండ్‌గా నటించిన అబ్బాయి గుర్తుండే ఉంటాడు. హీరోకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో ఇతను ఉంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి హీరో అయ్యాడు. నానిలో మహేష్ బాబు చిన్నప్పటి ఫ్రెండ్‌గా నటించిన అబ్బాయి ఎవరో కాదు. హీరో సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అశోక్ గల్లా. అశోక్ నటించిన హీరో సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది.

child artist in nani now became a hero

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అశోక్ గల్లా మీడియాతో మాట్లాడుతూ, తాను చిన్నప్పుడు రెండు సినిమాల్లో నటించినట్లు చెప్పారు. అందులో ఒక సినిమా కృష్ణ గారితో చేశాను అని, ఆ సినిమా చేసే సమయానికి తనకి అసలు ఈ ఫీల్డ్ పై పెద్దగా అవగాహన లేదు అని చెప్పారు. నాని సినిమా చేసే సమయానికి షూటింగ్ ఎలా ఉంటుంది, అలాగే మిగిలిన విషయాల గురించి కొంత తెలిసింది అని చెప్పారు. మధ్యలో చదువుకోడానికి వెళ్ళినప్పుడు కూడా సినిమాలకి, నటనకి సంబంధించిన అన్ని విషయాలపై పూర్తిగా తెలుసుకున్నాను అని చెప్పారు.


End of Article

You may also like