Ads
మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిన ఆడే చందమామలం పాట మనకు గుర్తుంది ఉంటుంది,దేవుళ్ళు సినిమా లో అమ్మానాన్న ప్రేమకోసం తపించే చిన్నారులుగా నటించారు బేబీ నిత్యా,మాస్టర్ నందన్ నటించారు,దేవుళ్ళు 2000 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.ఇందులో పృథ్వీరాజ్, రాశి, మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ గారు సంగీత దర్శకత్వం వహించారు
Video Advertisement
చిన్నప్పట్నుంచే సినిమాల్లో నటించడంతో నటన అనేది జీవితంలో ఓ భాగం అయిపోయింది. కొన్నాళ్ళు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా చేసిన నిత్యా తర్వాత నటనంటే ఇష్టంతో మళ్ళీ కెరీర్ ప్రారంభించింది సుమారు ఇరవై సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది నిత్య…చిన్ని చిన్ని ఆశ , లిటిల్ హార్ట్స్ చిత్రాలలో నటించినందుకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డును గెలుచుకున్నది.నటిగా దాగుడుమూత దండాకోర్ (2015), పడేసావే (2016) చిత్రాలలో నటించింది. తరువాత ఐవారట్టం (2015), కాదల్ కాలమ్ (2016) వంటి తక్కువ బడ్జెట్ తమిళ చిత్రాలలో నటించింది. 2019లో తెలుగులో నువ్వు తోపురా, తమిళంలో అఘావాన్ మొదలైన చిత్రాలలో నటించింది.బాలనటి నిత్యా,హీరోయిన్ నిత్యలో చాలా మార్పోచ్చింది.. మీరే చూడండి
ప్రస్తుతం నిత్య “ఓ పిట్ట కథ”మూవీ లో హీరోయిన్ గా నటించింది,భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయి మార్చి 6న విడుదలకి సిద్ధంగా ఉంది.
ఇప్పటివరకు పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ద్వారా చందు ముద్దు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
ఉత్కంఠంగా సాగే సన్నివేశాలతో, అందమైన విజువల్స్ తో మా ‘ఓ పిట్ట కథ’ మీ అందరిని అలరిస్తుంది”ఓ పిట్ట కథ”చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాదులో నిర్వహించింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఓ పిట్ట కధ ఒక విలేజ్‌లో జరిగే కథ ఇది.ఈ సినిమా లో నిత్యా పాత్ర పేరు వెంకటలక్ష్మి ,అయితే అదే ఊరిలో ఉంటున్నా ప్రభు కి వెంకటలక్ష్మి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం,అదే సమయంలో వెంటకాలక్ష్మి వాళ్ళ ఇంటికి క్రిష్ అనే వ్యక్తి వేరే దేశం నుండి వస్తాడు,తనకి కూడా వెంకటలక్ష్మి అంటే చాలా ఇష్టం,వారి ఇద్దరిలో వెంకటలక్ష్మి ఒక్కరిని ఇష్టపడుతున్న సమయంలో వెంకటలక్ష్మి కిడ్నప్ అవుతుంది,తర్వాత ఏం అయిందో తెలియాలి అంటే ఓ పిట్ట కధ సినిమా చూసేయాలి….ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగిస్తుంది.
End of Article