బయట కరోనా ఉంది..వెళ్ళద్దు నాన్నా…! చిన్నారి ఆవేదన…వీడియో వైరల్..!

బయట కరోనా ఉంది..వెళ్ళద్దు నాన్నా…! చిన్నారి ఆవేదన…వీడియో వైరల్..!

by Megha Varna

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులు , ఆకస్మిక మరణాలతో ఏమి చెయ్యాలో తెలియక తీవ్రంగా సతమతమవుతున్నాయి…భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది ..కరోనా వైరస్ తన ఉగ్రరూపాన్ని దాల్చేవేళ ప్రధాని మోడీ 21 రోజుల కంప్లీట్ లాక్ డౌన్ ని ప్రకటించారు…మోడీ సంపూర్ణ లాక్ డౌన్ ని ప్రకటించాక ముందే దేశంలో చాల రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్ ని ప్రకటించేసాయి ..

Video Advertisement

ఇలా లాక్ డౌన్ కి ప్రజలు సహకరిస్తుండగా కొంతమంది అతకాయిలు పోలిసుల మీద ఎదురుదాడి చేస్తున్నారు .. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు ..ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారస్తులు అందరూ ఇంటికి పరిమితం అవ్వగా డాక్టర్లు పోలీసులు రెవిన్యూ మునిసిపల్ శాఖవారు మాత్రం కరోనని అదుపులోకి తెచ్చేందుకు ప్రాణాలను పణంగా పెట్టిమరీ పనిచేస్తున్నారు …

ఇలా డ్యూటీకి వెళ్తున్న ఒక పోలీస్ బయటకి వెళ్తుంటే తన చిన్నకొడుకు వచ్చి నాన్న బయటకి వెళ్ళద్దు అంటుంటే మనం తీవ్ర భావోద్వేగానికి లోనుకావడం ఖాయం ..సంఘటనలోకి వెళ్తే ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక పోలీస్ డ్యూటీ కి వెళ్తుంటే తన కొడుకు వచ్చి భయంతో నాన్న బయటకి వెళ్ళద్దు బయట కరోనా వుంది అని అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది …

విధి నిర్వహాణలు నిర్వర్తిచడానికి వెళ్తున్న ఒక పోలీస్ కొడుకు వెళ్ళద్దు అని ఏడవడం తాను సముదాయించడానికి ప్రయత్నించడం సోషల్ మీడియాలో అందరిని బావోద్వేగానికి గురిచేస్తుంది ..ఇలా ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబానికి దూరంగా వుంటూ పోలీసులు కరొనపై యుద్ధం చేస్తున్నారని నెటిజన్లు తెగ మెసేజ్ లు పోస్ట్లు పెడుతున్నారు.

watch video:


You may also like

Leave a Comment