ఈ ఫోటోలో ఉన్న హీరోకి సౌత్ ఇండియా అంతా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు..! ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో ఉన్న హీరోకి సౌత్ ఇండియా అంతా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు..! ఎవరో తెలుసా..?

by kavitha

Ads

బాల్యం అనేది మధురమైన జ్ఞాపకం. చిన్నతనంలో రకరకాల సందర్భాల్లో తీసిన ఫోటోలు మరియు వీడియోలను జాగ్రత్తగా భద్రపరచుకుని పెద్దయ్యాక వాటిని చూసుకోని ఆ జ్ఞాపకాలలోకి వెళ్తుంటారు. వాటిని తమ పిల్లలకి, వారి పిల్లలకు కూడా చూపిస్తూ మధురానుభూతికి లోనవుతుంటారు.

Video Advertisement

ఇక సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఆడియెన్స్ ను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇటీవల కాలంలో తమ అభిమాన తారల పుట్టిన రోజు సందర్భంగా వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి వైరల్ అవడం తెలిసిందే. తాజాగా ఒక స్టార్ హీరో చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ హీరో ఎవరో? ఇప్పుడు చూద్దాం.. dulquer-salmaan-telugu addaపై ఫోటోలో గ్రీన్ షర్ట్ వేసుకుని ఫోటోకి ఫోజు ఇస్తున్న ఈ అబ్బాయి, గొప్ప నటుడుగా పేరున్న తండ్రికి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకుని సౌత్ ఇండస్ట్రీలో లో స్టార్ హీరోగా మారారు. తాను నటించే పాత్ర కోసం ఎంతైనా కష్టపడడం, ఆ పాత్రలో ఒదిగిపోవడం, లవ్, యాక్షన్ ఎమోషన్ ఏదైనా అద్భుతంగా చేయడం అతని ప్రత్యేకత. కథ, తాను చేసే పాత్ర నచ్చితే ఇతర భాషలలో నటించి, మెప్పిస్తున్న ఈ హీరోకి ఇతర ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.అంత టాలెంట్ ఉన్న హీరో ఎవరంటే దుల్కర్ సల్మాన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు. నిన్న (జూలై 28) దుల్కర్ బర్త్ డే సందర్భంగా అభిమానులు విషెస్ చెప్తూ, దుల్కర్ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా ద్వారా హీరోగా మారి, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అద్బుతమైన క్యారెక్టర్లు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ‘సీతా రామం’ తో టాలీవుడ్ లో చెరుగని ముద్ర వేసిన దుల్కర్, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్, మరియు పోస్టర్ దుల్కర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.  నటుడిగా మాత్రమే కాకుండా సింగర్, నిర్మాత కూడా. దుల్కర్ సల్మాన్ భార్య పేరు అమల్ సూఫియా. వీరికి ఒక పాప ఉన్నారు.

Also Read: “దుల్కర్ సల్మాన్” నెక్స్ట్ సినిమా కథ ఇదేనా..? ఏంటంటే..?


End of Article

You may also like