వరసగా చైనాకు సంబంధించి పెద్ద యాప్స్… బ్యాన్ అవేంటో తెలుసా?

వరసగా చైనాకు సంబంధించి పెద్ద యాప్స్… బ్యాన్ అవేంటో తెలుసా?

by Megha Varna

Ads

బోర్డర్ లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్నందున భారత్ ప్రభుత్వం చైనా పై మరియు ఆ దేశపు సంస్థల పై నిఘా పెట్టింది.అందులో భారతీయుల డేటా చౌర్యానికి చైనా యత్నిస్తోందని అందుకు ఈ కంపెనీల సహకారం అందిస్తుందని తెలియడంతో వాటిలో తొలిదశలో 59 యాప్స్ ను భారత్ ప్రభుత్వం నిషేధించింది.ఇందులో టిక్ టాక్,హలో వంటి ప్రముఖ యాప్స్ ఉన్నాయి.

Video Advertisement

ఈ యాప్స్ అన్నిటికీ ఇప్పటికే ఐటీ శాఖ 77 ప్రశ్నలతో కూడిన ఒక పత్రాన్ని పంపింది.చైనాలో మూలలు ఉన్న కంపెనీ డీటైల్స్ ను ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే విధంగా అక్కడ ఓ చట్టం ఉంది. యుద్ధ సమయంలో ప్రజల ఫోన్ లలోని యాప్స్ ద్వారా వారి ఖచ్చితమైన లొకేషన్ తెలుసుకొని దాడి చేసే అవకాశం ఉంది అందుకే వీటి పై బ్యాన్ ను పెట్టినట్టు ఢిల్లీ సర్కిల్స్ లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనా మూలాలు ఉన్న 47 యాప్స్ ను బ్యాన్ చేసింది. ఇందులో పబ్ జీ, ఆలీ ఎక్స్ ప్రెస్, యు లైట్ వంటి యాప్స్ ఉన్నాయి.పబ్ జీ డెవలప్ చేసింది సౌత్ కొరియన్ వీడియో గేమ్ కంపెని అయిన దీని వెనుక చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్ సెంట్ ఉంది.అందుకే ఈ యాప్ ను లిస్ట్ లో చేర్చారట.ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ఎప్పుడైనా వార్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అందుకే మొత్తం 275 చైనా యాప్స్ ను బ్యాన్ చేయడానికి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అందులో భాగంగా తొలి దశలో 59 యాప్ లను ఇప్పుడు రెండో విడతలో 47 యాప్స్ ను బ్యాన్ చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like