59 యాప్స్ ను భారత్ నిషేధించడం వల్ల చైనా ఎంత నష్టపోయిందో తెలుసా.?

59 యాప్స్ ను భారత్ నిషేధించడం వల్ల చైనా ఎంత నష్టపోయిందో తెలుసా.?

by Megha Varna

Ads

చైనా పేరు చెప్తే మిగిలిన దేశాలన్నింటికీ కోపం వచ్చేలా తయారయ్యింది పరిస్థితి. మరీ ముఖ్యంగా భారతదేశానికి. కరోనా, గాల్వాన్ ఘటన వల్ల చైనాతో భారతదేశానికి గొడవలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇటీవల భారతదేశ ప్రభుత్వం చైనా తయారుచేసిన 59 అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ లో నుండి తొలగించింది. ఇందులో 58 అప్లికేషన్లు ఒక ఎత్తైతే, జనాలకి మత్తు మందు లాగా ఎక్కిన టిక్ టాక్ యాప్ మరొక ఎత్తు.

Video Advertisement

59 చైనీస్ యాప్‌లను నిషేధించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతదేశంలోనే కాదు చైనా మీడియా కూడా విస్తృతంగా కవర్ చేస్తుంది. చైనా ప్రభుత్వ మీడియా ది గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, టిక్‌టాక్ మరియు హెలో యాప్‌ల మాతృ సంస్థ అయిన బైట్‌డాన్స్ – గోప్యత గురించి ఆందోళనలను పేర్కొంటూ భారత ప్రభుత్వం వాటిని నిషేధించాలని నిర్ణయించిన తరువాత 6 బిలియన్ డాలర్ల ( 45 వేల కోట్లు) నష్టపోయిందంట. మొబైల్ యాప్ ఎనాలిసిస్ సంస్థ సెన్సార్ ట్వూర్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, మే నెలలో టిక్‌టాక్ ను 112 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసారంట. అందులో అధిక శాతం మంది భారతీయులే అంట. భారత్ నిషేదించిన 59 యాప్స్ వల్ల మొత్తంగా రూ.70-80వేల కోట్ల వరకు చైనా నష్టపోయే అవకాశముందని తెలుస్తోంది.


End of Article

You may also like