ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సివిల్స్‌లో 75వ ర్యాంక్ సాధించిన స్టార్ కమెడియన్ కుమారుడు..ఎవరంటే.?

ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సివిల్స్‌లో 75వ ర్యాంక్ సాధించిన స్టార్ కమెడియన్ కుమారుడు..ఎవరంటే.?

by kavitha

Ads

సినీ పరిశ్రమలో అవకాశాలను అందుకుంటూ, గుర్తింపు తెచ్చుకుని స్టార్ స్టేటస్ ను పొందడం, దానిని నిలబెట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు.  అలా స్టార్ స్టేటస్ పొందిన సెలబ్రిటీస్ కొందరు దశాబ్దలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చాలామంది తమలాగే వారి పిల్లలని సైతం అదే రంగంలో ప్రోత్సహిస్తుంటారు.

Video Advertisement

అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్టార్ కిడ్స్ చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు హిట్స్ అందుకుని స్టార్ డమ్ ను పొంది, ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ కొందరు ఇందుకు భిన్నంగా వారికి నచ్చిన రంగాల్లో అడుగుపెట్టి, తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలా ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ కొడుకు కోచింగ్‌కు లేకుండా ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ కోలీవుడ్ నటుడు చిన్ని జయంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయన అసలు పేరు పేరు కృష్ణమూర్తి నారాయణన్. ఆయన హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా కోలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు. చిన్ని జయంత్ స్టార్ హీరోల సినిమాలన్నీటిలోనూ నటించి, అద్భుతమైన యాక్టింగ్ తో ఆడియెన్స్ ని అలరించారు. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన కుమారుడి పేరు శ్రుతంజయ నారాయణన్. తండ్రిలానే  శ్రుతంజయ కూడా ఇండస్ట్రీలో స్థిరపడతాడని అనుకుంటారు. కానీ శృతన్‌జయ మాత్రం భిన్నమైన మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు.

చెన్నైలో పుట్టి,పెరిగిన శ్రుతంజయ, అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు. చిన్నతనం నుంచి నాటకాలంటే ఆసక్తి ఉన్న శ్రుతంజయ ఫ్రెండ్స్ తో కలిసి నాటకాలలో చేసేవాడు. చదువులో కూడా ముందుండేవాడు. గిండీలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ కార్టోగ్రఫీలో డిగ్రీ చేశాడు. అశోక యూనివర్సిటీ లో ‘లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/లిబరల్ స్టడీస్‌’ లో మాస్టర్ డిగ్రీ చేశాడు. చదువు అయ్యాక ఒక స్టార్టప్‌ సంస్థలో జాయిన్ అయ్యాడు. అప్పుడే యాక్టింగ్ కు స్వస్తి చెప్పిన  శ్రుతంజయ యూపీఎస్సీ కి ప్రిపరేషన్ ప్రారంభించాడు. జాబ్ చేస్తూనే, రోజూ 4 నుంచి 5 గంటలు ప్రిపేర్ అయ్యాడు.

ఆ సమయాన్ని మెల్లిగా పెంచుకుంటూ రోజుకు 10 – 12 గంటల పాటు సన్నద్ధం అయ్యాడు. కోచింగ్‌కు వెళ్లకుండానే సొంతంగా ప్రిపేర్ అయ్యేవాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనాకూడా విడువకుండా తప్పులను దిద్దుకుని మళ్ళీ సన్నద్ధమయ్యాడు. రెండో సారి సివిల్స్‌లో విజయం సాధించాడు.  2015 యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 75వ ర్యాంక్ తెచ్చుకుని, ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ఇప్పుడు తమిళనాడు, త్రిప్పూర్ జిల్లా సబ్ కలెక్టర్‌గా ఉన్నారు.

ఐఏఎస్ ఆఫీసర్ శ్రుతంజయ సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఔత్సాహిక అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. “ఐఏఎస్ కావడం  కఠినమైనదే. ఆ ప్రిపరేషన్‌కు మానసికంగా కూడా రెడీ కావాలి. ఎందుకంటే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఏళ్ళు పట్టవచ్చు. అందుకు పట్టుదల, ఓపిక చాలా అవసరమని గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలో ఉత్తీర్ణత పొందిన అనంతరంట్రైనింగ్ ఉంటుంది. ఇది కొన్ని సమయాలలో  కఠినంగా ఉండవచ్చు. అయినప్పటికీ ఆపకూడదు” అంటూ శ్రుతంజయ చెప్పుకొచ్చారు.

Also Read:  “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”లో అలా చేయడమే “మైనస్” అయ్యింది…కెరియర్ క్లోజ్ అయిపోయింది అంటూ “అర్చన” కామెంట్స్.!

 


End of Article

You may also like