Chiranjeevi Latest Movie Details: ప్యాన్ ఇండియా స్థాయిలో.. మెగా 157 సినిమా..!

Chiranjeevi Latest Movie Details: ప్యాన్ ఇండియా స్థాయిలో.. మెగా 157 సినిమా..!

by Harika

Ads

మెగాస్టార్ చీరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్‌లో రిలీజ్ అయిన సినిమాలు అంత క్రేజ్‌ని తెచ్చిపెట్టలేదు. హిట్ అయ్యిందని చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది వాల్తేర్ వీరయ్య మాత్రమే. సైరా నరసింహారెడ్డి మంచి టాక్ వచ్చిన సరే.. అనుకున్నంత కలెక్షన్లు అయితే రాలేదు.

Video Advertisement

బడ్జెట్ వంద కోట్లు దాటిన.. ఆశించినంత స్థాయిలో అయితే సినిమా బిజినెస్ జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాడ్ ఫాదర్ ఏవరేజ్ టాక్ రాగా.. ఆచార్య, బోళాశంకర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. అందరికీ తెలిసిన కథలు.. అదే రీమేక్ సినిమాలు చేయడం వల్ల రిజల్ట్ నెగిటివ్ వచ్చిందని చీరంజీవి అభిప్రాయం.

కథలో కొత్తదనం లేకపోవడమే సినిమాలు హిట్ కొట్టటలేదని భావించిన చీరంజీవి.. ఈసారి జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి ఫాంటసీ కథలతో వస్తున్నట్లు సమాచారం. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చీరంజీవి ఓ కొత్త కథతో మెగా 157 సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ 170కోట్ల వరకు ఖర్చు చేస్తుందని వార్త ప్రచారం అవుతోంది.

Chiranjeevi Latest Movie

చీరంజీవి తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్న.. ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువగా బడ్జెట్ అవుతున్నట్లు సమాచారం. సైరా సినిమా తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమా ఇదేనేమో.

 


End of Article

You may also like