ఆ వ్యక్తి మా అమ్మ కాదు అంటూ చిరు ట్వీట్..! వైరల్ అవుతున్న ఫోటో వెనక అసలు కథ ఇదే.!

ఆ వ్యక్తి మా అమ్మ కాదు అంటూ చిరు ట్వీట్..! వైరల్ అవుతున్న ఫోటో వెనక అసలు కథ ఇదే.!

by Megha Varna

Ads

విజృంభిస్తున్న కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే .  ఈ సమయంలో  అందరు కూడా ఎవరివంతు సాయం వారు చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు ..సాధారణ ప్రజలు సైతం పేదలకు బియ్యం కూరగాయలు పంచిపెడుతున్నారు . డాక్టర్స్ ,పోలీస్ లు మరియు కొంత మంది అత్యసవర సిబ్బంది రాత్రి పగలు అనే తేడా లేకుండా తమ విధులను నిర్వర్తిస్తూ కరోనాతో యుద్ధం చేస్తున్నారు . ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరొనపై పోరులో తాను సైతం అంటూ ముందుకు వచ్చారు అంటూ ఒక వార్త నెట్ లో వైరల్ అవుతుంది. . వివరాలలోకి వెళ్తే ..

Video Advertisement

మెగాస్టార్ తల్లి అయిన అంజనాదేవి గత మూడు రోజులుగా తన స్నేహితురాళ్ళతో కలిసి 700 మాస్క్లులు కుట్టారు.వీటిని అవసరమైన పేదవారికి అందచేస్తున్నరు . తన వయసును కూడా లెక్క చెయ్యకుండా ఆమె ప్రజల కోసం తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో హాల్ చల్ చేసింది. ఈ వార్తా పై చిరంజీవి గారు స్పదించారు .

మానవతా ధృక్పధంతో తన తల్లి ఈ పని చేశారంటూ కొన్ని మీడియా ఛానెళ్లలో వార్త వచ్చిందని. అయితే ఆమె తన తల్లి కాదని చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు ఆ తల్లికిమనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ ట్వీట్ చేశారు చిరంజీవి గారు.


End of Article

You may also like