చిరంజీవికి షాలిని కుటుంబంకి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.? 11 ఏళ్ల క్రితం ఏమైందంటే?

చిరంజీవికి షాలిని కుటుంబంకి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.? 11 ఏళ్ల క్రితం ఏమైందంటే?

by Megha Varna

Ads

నితిన్‌ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్ వేదికగా పెళ్లి జరగనున్న సంగతి అందరికి తెలిసిందే. దుబాయ్‌లోని పలాజో వెర్సాసె‌లో ఏప్రిల్ 15 వ తేదీన నితిన్ వివాహ వేడుక జరగనుంది. ఏప్రిల్ 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలిసింది.నితిన్ కి కాబోయే భార్య గురించి తెలుసుకోడానికి నెటిజెన్లు ఎంతో సెర్చ్ చేస్తున్నారు.

Video Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరులో 1989 సెప్టెంబర్ 27న షాలిని జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. షాలిని చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్‌ వచ్చేసింది. సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో చదివి తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లిపోయారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక ఎమ్.ఎన్.సి లో హెచ్‌ఆర్‌ గా చేస్తున్నారు. నితిన్ కి షాలిని కి ఎనిమిది సంవత్సరాల నుండి పరిచయం ఉంది. నాలుగు సంవత్సరాల నుండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి ఈ సీక్రెట్ బాగానే మైంటైన్ చేసాడు నితిన్.

ఇక అసలు విషయానికి వస్తే…షాలిని తల్లితండ్రులు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు. వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. డాక్టర్ నూర్జహాన్‌కు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది.2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి అందరికి తెలిసిందే. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం సీటును నూర్జహాన్‌కు ఇచ్చారు చిరంజీవి. కానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీనే లేదు. నూర్జహాన్ కూడా రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు కూతురు పెళ్లితో ఆమె మళ్ళి వార్తల్లోకెక్కారు.


End of Article

You may also like