Home Filmy Adda “ముగ్గురు మొనగాళ్లు” సినిమాలో “చిరంజీవి”కి డూప్ గా నటించిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా.?

“ముగ్గురు మొనగాళ్లు” సినిమాలో “చిరంజీవి”కి డూప్ గా నటించిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా.?

by Mohana Priya

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి కె. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ నిర్మించారు. ఇందులో రమ్య కృష్ణ, నగ్మా, రోజా హీరోయిన్లు గా నటించగా విద్యాసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

రంగనాథ్ గారు, శ్రీవిద్య గారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సెంటిమెంట్ తో పాటు పాటలు కూడా ప్లస్ పాయింట్ అయ్యాయి. ముగ్గురు మొనగాళ్లు సినిమా లోని పాటలు ఇప్పుడు కూడా మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం. అయితే సినిమా గురించి చాలా మందికి ఒక ఒక డౌట్ ఉంది.

chiranjeevi movie title logos

అదేంటంటే. “ఈ సినిమాలో మూడు పాత్రలలో చిరంజీవి నటించారు. కానీ చిరంజీవి ఒక పాత్రలో నటిస్తున్న ఇప్పుడు మిగిలిన రెండు పాత్రల్లో వేరే వాళ్ళు ఉంటారు. వారు హైట్, పర్సనాలిటీ లో చిరంజీవికి దగ్గరగానే ఉంటారు. ఆ పాత్రలను ఎవరు పోషించారు?” అని.

chiranjeevi dupes in mugguru monagallu

చిరంజీవి పోషించిన మూడు పాత్రలలో రెండు పాత్రలు పోషించిన వాళ్ళలో ఒక్కరు చిరంజీవి అసిస్టెంట్ అయిన సుబ్బారావు, ఇంకొకరు నటులు హరిబాబు. వీరిద్దరూ మరో ఇద్దరు చిరంజీవిల పాత్రలను పోషించారు. మనం సడన్ గా వారిని వెనక నుంచి చూస్తే అచ్చం చిరంజీవి నిలబడినట్టుగానే కనిపిస్తారు. అలా చూసినప్పుడు ఆ పాత్రలో చిరంజీవి ఉన్నట్టే మనకి అనిపిస్తుంది. వీరిద్దరు చిరంజీవి పాత్రలకి అంత  పర్ఫెక్ట్ గా సరిపోయారు.

You may also like