“అంత హంగామా చేశారు దీని కోసమేనా..?” అంటూ… చిరంజీవి “గాడ్ ఫాదర్” పై కామెంట్స్..!

“అంత హంగామా చేశారు దీని కోసమేనా..?” అంటూ… చిరంజీవి “గాడ్ ఫాదర్” పై కామెంట్స్..!

by Megha Varna

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీనటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ఈ చిత్రంలో నయనతార కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలానే సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టీజర్ లో వీళ్లందరినీ మనం చూడచ్చు. ఇదిలా ఉంటే చాలా రోజుల నుండి అందరినీ ఎదురు చూసేలా చేసి ఆఖరికి అప్సెట్ చేసింది ఈ సినిమాలో పాట. సాధారణంగా మెగా స్టార్ అంటే మనం ఓ రేంజ్ లో ఊహించుకుంటాం. కానీ ఈ పాట మాత్రం అందరినీ అప్సెట్ చేసింది. గాడ్ ఫాదర్ సినిమాలో థమన్ ”తార్ మార్ టక్కర్ మార్” పాటను తీసుకొచ్చాడు. అందులో జోష్ లేదు ఎనర్జీ లేదు.

chiranjeevi god father teaser bgm copied from a recent telugu song

నిజానికి నాలుగు రోజుల నుండి కూడా ప్రేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నారు. కానీ ఏ మాత్రం అది ఇంప్రెస్ చెయ్యలేదు. డ్యాన్స్ డైరక్టర్ ప్రభు దేవా, డాన్సర్స్ ని పక్కన పెడితే హీరోలు ఇద్దరి మూవ్మెంట్స్ కూడా ఔరా అనిపించలేదు. అలానే ట్యూన్ కూడా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది.

లిరిక్స్ బాగున్నప్పటికీ.. ట్యూన్ సరిగా లేకపోవడం మైనస్ అయ్యింది. చిరంజీవి, సల్మాన్  అంటే ఒక రేంజ్ లో ఉండాలి కదా..? పైగా ఫ్యాన్స్ కి అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రోజుల నుండి ఎంతో ఎదురు చూసారు ప్రేక్షకులు. కానీ ఆఖరికి ఇలా అయ్యింది. చిరంజీవి మాత్రం ఇప్పుడు ఫుల్ బిజీలో వున్నారు. గాడ్ ఫాదర్ సినిమాతో పాటు భోళా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు.


You may also like