Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ నిన్న విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవితో పాటు సినిమాలో ఉన్న ముఖ్య నటీనటులు కూడా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
Video Advertisement
అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరూ కూడా టీజర్ లో కనిపించారు. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
గాడ్ ఫాదర్ సినిమా లో ఎన్నో అంశాలు ఉంటాయి. ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్ నటులు నటించడంతో, సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకు కారణం ఈ సినిమా టీజర్ లో సరిగ్గా గమనిస్తే చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి వచ్చే సీన్ గ్రాఫిక్స్ చేసినట్టు అర్థం అవుతోంది. ఆ గ్రాఫిక్స్ సరిగ్గా లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇద్దరు హీరోల మొహాలు తీసుకొచ్చి అతికించే గ్రాఫిక్స్ చేశారేమో అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి.
ఈ సినిమా టీజర్ కి వస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గమనిస్తే వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాలోని టైటిల్ సాంగ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. రెండు ట్యూన్స్ ఒకేలాగా ఉండడంతో, నెటిజన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించడం ఇదే మొదటిసారి. సినిమా పాటల కంపోజిషన్ కి సంబంధించి కూడా తరచుగా తమన్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా అంతటా ఈ విషయం వైరల్ అవుతోంది.
watch video :
End of Article