Ads
- చిత్రం : గాడ్ ఫాదర్
- నటీనటులు : చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్.
- నిర్మాత : రామ్ చరణ్ (కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ), R. B. చౌదరి, N. V. ప్రసాద్ (సూపర్‌గుడ్ ఫిలిమ్స్)
- దర్శకత్వం : మోహన్ రాజా
- సంగీతం : ఎస్.ఎస్.తమన్
- విడుదల తేదీ : అక్టోబర్ 5, 2022
Video Advertisement
స్టోరీ :
PKR రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన కూతురు సత్యప్రియ (నయనతార), అల్లుడు జయదేవ్ (సత్యదేవ్). PKR చనిపోయిన తర్వాత జయదేవ్ సీఎం కుర్చీలో కూర్చోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇదంతా ఇలా ఉండగా బ్రహ్మ (చిరంజీవి) PKR కి, ఇంకొకరికి పుట్టిన కొడుకు, జయదేవ్ ముఖ్యమంత్రి కావడానికి ఇష్టపడని వారిలో ఒకరు. జయదేవ్ ముఖ్యమంత్రి కాకుండా బ్రహ్మ ఎలా అడ్డుకుంటాడు? ముఖ్యమంత్రి ఎవరు అయ్యారు? బ్రహ్మకి, సత్యప్రియకి మధ్య ఉన్న గొడవలు ఏంటి? అక్కడ జరుగుతున్న సమస్యలన్నిటిని బ్రహ్మ ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చాలా కొత్తగా ఉన్నా కూడా సినిమా ఫలితం ఆశించిన విధంగా రాలేదు. దాని తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ప్రేక్షకులని నిరాశపరిచింది. దాంతో ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమా మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్. లూసిఫర్ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కూడా సినిమా అంతా బలమైన కథతో నడుస్తుంది. సినిమాకి కథ పెద్ద ప్లస్ పాయింట్. దాంతో ఈ సినిమా రీమేక్ ఆయిన గాడ్ ఫాదర్ లో కూడా మెయిన్ పాయింట్ లో పెద్దగా మార్పులు చేయలేదు.
కానీ మలయాళంలో మోహన్ లాల్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. తెలుగులో మాత్రం చిరంజీవి దాదాపు 2 గంటల పాటు సినిమాలో కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చాలా విషయాలను సినిమాలో మార్చారు. కానీ మెయిన్ పాయింట్ మాత్రం అలాగే ఉంచారు. ఇది సినిమాకి ఒకరకంగా ప్లస్ అని చెప్పవచ్చు. మలయాళం సినిమాలో లాగానే తెలుగు సినిమాలో కూడా చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. కానీ వారంతా కథ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడ్డారే తప్ప, సినిమా చూస్తున్నంత సేపు స్టార్స్ లాగా అనిపించరు.
మలయాళం సినిమాతో పోల్చి చూస్తే తెలుగు సినిమాలో ఎలివేషన్స్ ఉన్నాయి. కానీ కథపరంగా కూడా అంతే బాగుండేలాగా చూసుకున్నారు. పర్ఫామెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ వారి పాత్రలకి న్యాయం చేశారు. కానీ సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం చిరంజీవి మాత్రమే. కమర్షియల్ హీరో పాత్రకి భిన్నంగా ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఉంటుంది. అయినా సరే ప్రేక్షకులు నిరాశ పడకుండా ఉండేలాగా ఎలివేషన్స్, డైలాగ్స్ బలంగా ఉండేలా చూశారు.
అలాగే మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సముద్రఖని వీరు కూడా తమ పాత్రలో పరిధి మేరకు నటించారు. సినిమాకి రెండవ హీరో మాత్రం తమన్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి మరింత బలం అందించారు. అలాగే సత్యదేవ్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచారు. సినిమా అంతా బాగున్నా కూడా గ్రాఫిక్స్ విషయంలో మరి కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. చాలా చోట్ల చాలా సీన్స్ ఆర్టిఫిషియల్ గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య వచ్చే సీన్స్ కూడా ఒక కమర్షియల్ సినిమాలో ఉన్నట్టుగా ఉంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కూడా అనవసరంగా ఉన్నాయేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- చిరంజీవి
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- నిర్మాణ విలువలు
- మెయిన్ పాయింట్
మైనస్ పాయింట్స్:
- గ్రాఫిక్స్
- కొన్ని అనవసరమైన సీన్స్
రేటింగ్ :
3.5 / 5
ట్యాగ్ లైన్ :
ఒరిజినల్ చూసినా, చూడకపోయినా కూడా గాడ్ ఫాదర్ సినిమా నిరాశపరచదు. చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే కథ పరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అలాగే పొలిటికల్ సినిమాలని ఇష్టపడే వారికి గాడ్ ఫాదర్ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
watch trailer :
End of Article