Home Filmy Adda చై-సామ్ విడాకుల విషయంలో కొత్త ట్విస్ట్.! ఏకంగా మెగాస్టార్ జోక్యం చేసుకొని మరీ.?

చై-సామ్ విడాకుల విషయంలో కొత్త ట్విస్ట్.! ఏకంగా మెగాస్టార్ జోక్యం చేసుకొని మరీ.?

by Mohana Priya

సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి.

అయితే, ఈ విషయం గురించి చర్చ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇందుకు సంబంధించిన కొత్త పుకార్లు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో మరొక ట్విస్ట్ బయటికి వచ్చింది. ఫిల్మీ లాగ్ కథనం ప్రకారం సమంత, నాగ చైతన్య మధ్య జరుగుతున్న విషయం గురించి నాగార్జున చాలా కోపంలో ఉన్నారు. దాంతో లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి నాగార్జున సుముఖత చూపలేదు.Reason behind Nagarjuna not attending the press meet of Telugu Bigg Boss 5

అప్పుడు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు. చిరంజీవి నాగార్జున కుటుంబానికి చాలా సన్నిహితులు. ఒకవేళ చిరంజీవి గనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైతే, “సమంత ఎందుకు రాలేదు?” అని కానీ, లేదా ఆ విషయంపై కానీ అంత ఫోకస్ వెళ్లదు అని, మీడియా దృష్టి అంతా ఎక్కువగా మెగాస్టార్ మీద పడుతుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.chiranjeevi interference in naga chaitanya samantha divorce

ఏదేమైనా, నాగ చైతన్య సమంత ఫ్యాన్స్ మాత్రం వారిద్దరూ విడిపోకూడదు అని సోషల్ మీడియాలో చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై బయటకు వచ్చిన ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఒక వెబ్ సిరీస్ కోసం ఇది ఒక పబ్లిసిటీ అని, ఎందుకంటే ఆ సిరీస్ డివోర్స్ మీద నడుస్తుంది అని సమాచారం.

You may also like