శ్రీదేవి కారణంగా ఆగిపోయిన ఈ 2 “చిరంజీవి” సినిమాలు ఏవో తెలుసా..?

శ్రీదేవి కారణంగా ఆగిపోయిన ఈ 2 “చిరంజీవి” సినిమాలు ఏవో తెలుసా..?

by Megha Varna

Ads

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకి దగ్గరయ్యారు శ్రీదేవి. చిరంజీవితో పాటు తెలుగు చిత్రాల్లో నటించి తిరుగులేని క్రేజ్ పొందారు శ్రీదేవి. పైగా శ్రీదేవి తో సినిమా తీయాలని దర్శక నిర్మాతలు కూడా ఎదురుచూసేవారు.

Video Advertisement

అయితే సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి, చిరంజీవి మంచి హిట్స్ కొట్టినప్పటికీ చిరంజీవికి మాత్రం చాలా నష్టం కలిగింది. శ్రీదేవి వలన చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో ఆగిపోయాయి. దీనికి గల కారణం ఏమిటంటే శ్రీదేవి స్టార్ హీరోయిన్ అవ్వడమే. ఆమె పెట్టిన కండిషన్స్ కి దర్శకనిర్మాతలు ఒప్పుకోకపోవడంతో చిరంజీవితో నటించాల్సిన సినిమాలు కూడా ఆగిపోయాయి.

ఇక మరి ఆ సినిమాలు ఏమిటి అనేది చూస్తే… వజ్రాల దొంగ సినిమా స్క్రిప్ట్ ని ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సిద్ధం చేశారు. ఆ సినిమాలో శ్రీదేవి, చిరంజీవి నటించాల్సి ఉంది. కానీ ఈ సినిమాకి నిర్మాతగా శ్రీదేవి వ్యవహరించారు. తన పాత్ర హైలెట్ చేయాలని ఆమె కండీషన్ పెట్టారట. చిరంజీవిని తక్కువ చేసి చూపించడం ఇష్టంలేక దర్శకుడు ఈ సినిమాని పూర్తిగా క్యాన్సిల్ చేశారట.

ఇదిలా ఉంటే కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి తో సమానంగా ఫైట్ సీన్లు శ్రీదేవి ఉండాలని ఆమె కండిషన్ పెట్టారట. పైగా కొండవీటి దొంగ టైటిల్ కి బదులుగా కొండవీటి రాణి అని పెట్టాలని శ్రీదేవి చెప్పారట. ఆ మార్పు చేయడం ఇష్టం లేక సినిమా నుంచి శ్రీదేవిని తొలగించారు. కొండవీటి దొంగ చిరంజీవికి మంచి హిట్ ని తీసుకు వచ్చింది. అయితే చిరంజీవితో నటించాలంటే ఆమె కూడా అలాంటి కండిషన్లు పెట్టకూడదని తెలుసుకున్నారు.


End of Article

You may also like