చిరంజీవి నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనా..? ప్లాన్ మామూలుగా లేదుగా..?

చిరంజీవి నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనా..? ప్లాన్ మామూలుగా లేదుగా..?

by Mohana Priya

Ads

ఈ వయసులో కూడా వరుస సినిమాలతో యంగ్ హీరోలకి పోటీ చేస్తున్న నటుడు చిరంజీవి. ప్రతి సంవత్సరం ఒక సినిమా విడుదల చేస్తూనే ఉన్నారు. అయితే చిరంజీవి మరొక యంగ్ డైరెక్టర్ తో చెయ్యి కలపబోతున్నారు అనే వార్త వచ్చింది. ఆ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Video Advertisement

అనిల్ రావిపూడి తన స్టైల్ కామెడీకి పెట్టింది పేరు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన ప్రతి సినిమాలో కామెడీ ఉంటుంది. అటు కామెంట్స్ చేసేవారు ఉన్నా కూడా, ఇటు ఆ కామెడీని ఎంజాయ్ చేసే వారు కూడా ఉన్నారు. అందుకే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.

ఇప్పుడు అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం చిరంజీవి కామెడీ టైమింగ్. చాలా పాత సినిమాల్లో చిరంజీవి కామెడీ టైమింగ్ చూసాం. చంటబ్బాయి, అందరివాడు ఇలా చాలా సినిమాల్లో చిరంజీవి తన స్టైల్ కామెడీ టైమింగ్ తో పాత్రకి న్యాయం చేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా చిరంజీవి కామెడీ పాత్ర పోషించిన పాత్రలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకి గుర్తుండిపోయాయి. దాంతో ఇన్ని సంవత్సరాలు తర్వాత చిరంజీవి మళ్ళీ అలాంటి ఒక కామెడీ పాత్రలో నటిస్తారు అంటే ప్రేక్షకులకి చూడడానికి ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ వార్త ప్రచారంలో ఉంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే దీని మీద అధికారిక ప్రకటన వచ్చే అంతవరకు ఆగాల్సిందే.


End of Article

You may also like