హనుమంతుడి పాత్రలో నటిస్తున్న చిరంజీవి… ఏ సినిమాలో అంటే…?

హనుమంతుడి పాత్రలో నటిస్తున్న చిరంజీవి… ఏ సినిమాలో అంటే…?

by Mounika Singaluri

Ads

మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తులు అనే విషయం తెలిసింది. మెగా కుటుంబమంతా ఆంజనేయ స్వామికి ఆరాధ్యులు. చిరంజీవి కూడా ఆంజనేయ స్వామి పైన తన భక్తిని ప్రేమని సందర్భం వచ్చినప్పుడల్లా చాటుకుంటూ ఉంటారు.

Video Advertisement

కార్టూన్ నెట్వర్క్ సిరీస్ లో ఆంజనేయస్వామి పాత్రకి చిరంజీవి స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు హనుమంతుడి పాత్రలో చిరంజీవి మరోసారి కనిపిస్తున్నారని వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది… పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్ ప్రమోషన్స్ పరంగా పెద్ద సినిమాకి పోటీగా ఉంది. పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నా కూడా లెక్క చేయకుండా తమ సినిమా మీద నమ్మకంతో మేకర్ హనుమాన్ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో తేజ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీ బిజీగా గడుపుతున్నారు. టీజర్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది .

సినిమా మీద మంచి హైప్ కూడా తీసుకువచ్చాయి. అయితే ట్రైలర్ లో లాస్ట్ లో హనుమంతుడిని కళ్ళును చూపించారు. ఆ కళ్ళు చూసిన ఎవరైనా సరే అవి మెగాస్టార్ చిరంజీవి కళ్ళు లా ఉన్నాయని అంటున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత వర్మను అడగగా ఆయన కూడా అవును అని సమాధానం చెప్పారు అయితే సినిమాలో చిరంజీవి నటిస్తున్నారా అని అడగగా దానిపైన సమాధానం చెప్పలేదు హనుమంతుడు పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలంటూ సస్పెన్స్ లు పెట్టారు అయితే చాలామంది చిరంజీవి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారని అంటునారు. గ్రాఫిక్స్ లో ఈ పాత్రను సృష్టించారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like