Ads
- చిత్రం : వాల్తేరు వీరయ్య
- నటీనటులు : చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్ ట్రెసా, ప్రకాష్ రాజ్.
- నిర్మాత : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
- దర్శకత్వం : కెఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
- సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
- విడుదల తేదీ : జనవరి 13, 2023
Video Advertisement
స్టోరీ :
సినిమా మొత్తం వైజాగ్ లో నడుస్తుంది. అక్కడ జాలరి పేటలో నివసించే వీరయ్య (చిరంజీవి) అంటే ఆ ప్రాంతం మొత్తానికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. వీరయ్య చెప్పిన మాటని అందరూ పాటిస్తూ ఉంటారు. వీరయ్యకి, కాలా (ప్రకాష్ రాజ్) అనే స్నేహితుడు ఉంటాడు. వీరయ్యకి తెలియకుండానే ఆ ప్రాంతంలో కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరుగుతూ ఉంటాయి.
ఇవన్నీ తెలుసుకున్న ఎసిపి విక్రమ్ సాగర్ (రవితేజ) ఆ ప్రాంతానికి వచ్చి ఆ పనులను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత విక్రమ్ ఏమయ్యాడు? వారు చేసే పనులని ఆపాడా లేదా? వీరయ్యకి ఇదంతా తెలిసిందా? వీరయ్య విక్రమ్ కి సహాయం చేశాడా? అసలు వీరయ్య మలేషియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీరయ్యకి, విక్రమ్ కి ఉన్న సంబంధం ఏంటి? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆచార్య సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. గాడ్ ఫాదర్ స్టోరీ పరంగా బాగున్నా కూడా కలెక్షన్ల పరంగా అంత పెద్దగా రాలేదు. దాంతో ఇప్పుడు ప్రేక్షకుల ఆశలు అన్ని వాల్తేరు వీరయ్య సినిమా మీదే ఉన్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు అని మనకి టీజర్, ట్రైలర్ చూస్తే ఈపాటికి అర్థం అయిపోయింది. దాంతో సినిమా ఎలా ఉన్నా కానీ చిరంజీవి ఇలా సినిమా మొత్తం ఉంటే కచ్చితంగా హిట్ అవుతుంది అని అనుకున్నారు.
ఇంక సినిమా విషయానికి వస్తే కథపరంగా పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది. కానీ సినిమా కొన్ని సీన్స్ మాత్రం ప్రేక్షకులకి అర్థం అవ్వకుండా ఉన్నాయి. రవితేజ కనిపించిన కొంచెం సేపు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్స్ గా నటించిన శృతి హాసన్, కేథరిన్ ట్రెసా కూడా వారి పాత్రల పరిధి మేరకు నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, బాబీ సింహ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. వీరు కూడా తమ పాత్రకి తగ్గట్టుగా నటించారు. ఇంక చిరంజీవి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన తెరపై కనిపించినంత సేపు అసలు ఇలాంటి చిరంజీవిని మనం చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో అని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా తనలోని ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు అని చిరంజీవి మరొకసారి నిరూపించారు. డాన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ పాత చిరంజీవిని గుర్తుతెచ్చేలాగా ఉన్నాయి. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ముందు ట్రోలింగ్ కి గురైనా కూడా తెరపై చూడడానికి బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. కానీ కథపరంగా మాత్రం సినిమా చాలా చోట్ల కాస్త వెనకబడిందేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- చిరంజీవి
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సాంకేతిక విలువలు
- కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- సాగదీసినట్టు ఉండే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
అసలు సినిమా కథ మీద ఎలాంటి అంచనాలు లేకుండా, కేవలం చిరంజీవి కోసం మాత్రమే సినిమా చూడాలి, లేదా పండగకి ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా చూడాలి అనుకునే వారికి వాల్తేరు వీరయ్య సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article