Ads
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్, ఆ తర్వాత వేదాళం రీమేక్ లో నటించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టేముందు చిరంజీవి చికిత్స తీసుకోవడానికి విశాఖపట్నం వెళ్ళినట్లు ఒక వార్త ప్రచారం అవుతోంది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, సాక్షి కథనం ప్రకారం నేచర్ క్యూర్ ఆయుర్వేద చికిత్స కోసం చిరంజీవి విశాఖపట్నం వెళ్లారట. అక్కడి ఆయుర్వేదిక్ స్పా లో డీటాక్సిఫికేషన్, రెజువినేషన్ చికిత్సలను తీసుకుంటున్నారు. అక్కడ ఒక పది రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటారట. దిల్ రాజు గారు కూడా ఆ ఆయుర్వేదిక్ స్పా కి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ ప్రక్రియల ద్వారా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తీసేస్తారు. అంతే కాకుండా అలసట కూడా తగ్గుతుంది. కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా విశ్రాంతి కోసం ఇలాంటి ప్రక్రియను అనుసరిస్తారట. చిరంజీవి నెక్స్ట్ సినిమా అయిన లూసిఫర్ రీమేక్ కి హనుమాన్ జంక్షన్ సినిమా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న వేదాళం సినిమా రీమేక్ లో కూడా నటించబోతున్నారు చిరంజీవి. ఇవి మాత్రమే కాకుండా దర్శకుడు బాబి కూడా చిరంజీవికి కథ చెప్పినట్టు, ఆ కథ చిరంజీవికి నచ్చినట్టు, ఈ రెండు సినిమాల తరువాత బాబితో చిరంజీవి సినిమా చేయనున్నట్లు సమాచారం.
End of Article