కరోనా దెబ్బకు సినిమాల్లో కొత్త రూల్స్ ఇవే..!!

కరోనా దెబ్బకు సినిమాల్లో కొత్త రూల్స్ ఇవే..!!

by Megha Varna

Ads

సినిమా అంటేనే ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్లడం.మాములుగా సినిమా కథలలో చాలా రకాల కధాంశాలు ఉంటాయి.హారర్ ,కామెడీ ,సెంటిమెంట్,సస్పెన్సు,లవ్ ఇలా చాలా రకాల జోనర్స్ ఉంటాయి.కానీ మొదట నుండి కూడా ప్రేమ ,శృంగార చిత్రాలకు ఉన్న ఆదరణ వేరే జోనర్స్ కి లేవనే చెప్పాలి.ఎందుకంటే ఏ వయసు వారైనా కూడా ప్రేమ చిత్రాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడమే దీనికి కారణం.ఈ మధ్య కాలంలో లిప్ లాక్ సన్నివేశాలు కచ్చితంగా చిత్రంలో ఉండాలి లేకపోతె సినిమా హిట్ కాదు అనేంతగా ప్రేక్షకుల మైండ్ సెట్ ఉంది అంటే ఈ మేనియా ఏ రేంజ్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Video Advertisement

తాజా కరోనా వైరస్ నేపథ్యంలో షూటింగ్స్ అన్ని కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.అయితే త్వరలో షూటింగ్స్ అన్ని కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి.అయితే ఇదివరకు లాగా ఇప్పుడు చిత్రాలలో రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోవని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుండి కొత్త ఆంక్షలు రానున్నాయి అని కొన్ని వర్గాల నుండి వస్తున్న సమాచారం .ఈ కరోనా వైరస్ కారణంగా భవిష్యత్తులో సినిమా షూటింగ్ లో ఎలాంటి సన్నివేశాలు ఎంతమేరకు ఉండవచ్చు అని అన్ని దేశాల ప్రతినిధులు ఆన్లైన్ లో సమావేశమయ్యారు.భారత దేశం నుండి అమిత్ భలే ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అమిత్ భలే మాట్లాడుతూ ..కరోనా వైరస్ కారణంగా మనం భవిషత్తులో ఎటువంటి ఇబ్బందులు పడకూడదు.అందుకే దానికి తగినట్లుగా షూటింగ్లు ఉండాలి అని వెల్లడించారు.ఎందుకంటే సినిమా షూటింగ్ అంటే ఒక దేశం నుండి ఇంకో దేశం వెళ్లాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది.ఈ నేపథ్యంలో కచ్చితంగా కొన్ని నియమాలను అందరు పాటించాలి అని చర్చించుకున్నట్లుగా అమిత్ తెలిపారు.ఇకపై షూటింగ్ సమయంలో కచ్చితంగా వైరాలజిస్టులు ఉండాలి అని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా అమిత్ తెలిపారు.భవిషత్తులో కరోనా కారణంగా కొన్ని మార్పులు కచ్చితంగా సినిమాలలో కనపడనున్నాయి .


End of Article

You may also like