Ads
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రాబోతున్న సినిమా రిపబ్లిక్. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. మణి శర్మ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ సినిమా 2021 సంవత్సరం మొదట్లోనే విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడి అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ పంజా అభిరామ్ గా సాయి ధరమ్ తేజ్ నటించారు.
Video Advertisement
సినిమా రాజకీయ నేపథ్యంలో నడుస్తుంది. ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. నిజ జీవిత ఘటనలో చూస్తే సాయి ధరమ్ తేజ్ పోషించిన పాత్ర బతికి ఉండరు. ఒక ఇంటర్వ్యూలో దేవ కట్టా మాట్లాడుతూ, “సాయి ధరమ్ తేజ్ కి కథ చెప్పి, క్లైమాక్స్ చేయలేవు” అని చెప్తే, అందుకు సాయి ధరమ్ తేజ్, “క్లైమాక్స్ ముందు రాసినట్టు ఉంటేనే చేస్తాను” అని చెప్పారట. ఇంతకీ క్లైమాక్స్ లో ఏం ట్విస్ట్ ఉండబోతోందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
End of Article