Home Filmy Adda “రామ్ చరణ్” తో సినిమా చేసిన తర్వాత… ఈ 3 హీరోయిన్స్ విషయంలో ఒకేలాగా జరిగిందా..?

“రామ్ చరణ్” తో సినిమా చేసిన తర్వాత… ఈ 3 హీరోయిన్స్ విషయంలో ఒకేలాగా జరిగిందా..?

by Mohana Priya

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కూడా పాన్ – ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది.

ఈ సినిమా పాటలు షూటింగ్ కి చాలా ఖర్చు చేశారు అనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే అంజలి కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరో శ్రీకాంత్, సునీల్, ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. వాటిలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నారు. అయితే రామ్ చరణ్ గత సినిమాలకి ఈ సినిమాకి ఒక కో – ఇన్సిడెన్స్ ఉంది. అదేంటంటే రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది అందరికీ తెలుసు. అందులో సమంత హీరోయిన్ గా నటించారు.

unnoticed details in janani rrr song

ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకులని అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ జరిగిపోయి విడుదల అయిన కొద్ది రోజులకి ఆలియా భట్ పెళ్లి జరిగింది.

co incidence with ram charan movie heroines

కానీ అప్పటికే సినిమా షూటింగ్ అయిపోయింది. అలాగే రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు సమంత పెళ్లి జరిగింది. తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ RC15 సినిమా హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి కూడా ఇటీవల జరిగింది. ఇప్పుడు కియారా అద్వానీ కూడా మళ్లీ సినిమా షూట్ చేయాల్సి ఉంది. దాంతో సోషల్ మీడియాలో, “ఇదేంటి ఈ ముగ్గురు హీరోయిన్ల విషయంలో ఇలా జరిగింది?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like