Ads
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించాలంటే కచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు అంటే వంద, రెండు వందలు అలా కాదు. 10, 20 అలా అన్నమాట. వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనవి చేంజ్. అంటే నాణాలు. బస్సు ఎక్కితే టికెట్ తీసుకోవాలి అంటే కచ్చితంగా ఒక్క రూపాయి, రెండు రూపాయలు, ఇంకా ఐదు రూపాయల నాణాలు ఉండాలి. ఒకవేళ లేకపోతే మనకి తిరిగి రావాల్సిన చేంజ్ కోసం మనం బస్ దిగేంతవరకు ఎదురు చూడాల్సిందే.
Video Advertisement
మీకు ఒక విషయం తెలుసా? చూడడానికి అన్నీ నాణాలు ఒకే లాగా కనిపిస్తాయి. కానీ అన్ని నాణాలు వేర్వేరుగా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఒక్క రూపాయి నాణేలు ఒకే లాగా ఉంటాయి. అలాగే అన్ని రెండు రూపాయల నాణేలు, ఇంకా ఐదు రూపాయల నాణేలు కూడా ఒకేలాగా ఉంటాయి. కానీ అవి తయారయ్యే చోటును బట్టి నాణేల మీద చిన్న డిఫరెన్స్ ఉంటుంది.
#1
#2
#3
#4
ఇప్పుడు పైన కనిపిస్తున్న నాణాలను చూడండి. అన్ని ఒక్క రూపాయల నాణాలే. అన్ని ఒకేలాగా ఉన్నాయా? గమనించండి. మీలో చాలామంది బహుశా వేరు వేరు సంవత్సరాల్లో తయారు చేయడం వల్ల మోడల్ డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ అన్ని రూపాయి నాణాలు ఒకటే అనుకుంటున్నారా? కానీ కాదు.
మనదేశంలో నాణాలు నాలుగు ప్రదేశాలలో తయారు చేయబడతాయి. ముంబై, కోల్కతా లో ఉన్న అలీపూర్, హైదరాబాద్ లో ఉన్న సైఫాబాద్, చర్లపల్లి, ఉత్తరప్రదేశ్ లో ఉన్న నోయిడా లో భారతీయ కరెన్సీ తయారు చేసే మింట్స్ ఉన్నాయి.
ఒకవేళ నాణెంపై చివరిలో డైమండ్ సింబల్ ఉంటే ఆ నాణెం ముంబైలో ముద్రించిన నాణెం అని అర్థం. ఒకవేళ ఎటువంటి సింబల్ లేకపోతే నాణెం కోల్కత్తాలో ముద్రించారు అని అర్థం.
ఒకవేళ స్టార్ సింబల్ ఉంటే హైదరాబాద్ లో ముద్రించబడిన నాణెం అని అర్థం. డాట్ (చుక్క) ఉంటే నోయిడాలో ముద్రించిన నాణెం అని అర్థం. ఒకసారి మీ దగ్గర ఉన్న నాణాలను కూడా గమనించి చూడండి. ఈ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బట్టి ఆ నాణెం ఎక్కడ ముద్రించబడింది అనే విషయాన్ని తెలుసుకోండి.
https://www.quora.com/What-are-some-interesting-facts-2/answer/Ankit-Raj-Mahapatra-3?ch=99&share=aa677d8b&srid=uT1aG&fbclid=IwAR03APa6lajmi5I25UjHF7rAOOW82fogqwhKa1q5gVq8zkLUnxjNKG1ReVI
End of Article