Home Filmy Adda ఈ 4 “పవన్ కళ్యాణ్” సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..? రెండు ఫ్లాప్…రెండు హిట్.!

ఈ 4 “పవన్ కళ్యాణ్” సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..? రెండు ఫ్లాప్…రెండు హిట్.!

by Mohana Priya

చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.

సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

reasons behind the negative talk for bheemla nayak trailer

అంతే కాకుండా సినిమాకి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పులు కూడా వర్కవుట్ అయ్యాయి. మన నేటివిటీకి తగ్గట్టు చేసిన ఆ మార్పులు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఒరిజినల్ సినిమా కంటే తెలుగు సినిమా దాదాపు 30 నిమిషాల నిడివి తక్కువ ఉంటుంది. వీటన్నిటి వల్ల సినిమా క్రేజ్ ఇంకా పెరగడంతో ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. మళ్లీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాతో అంత పెద్ద హిట్ పడింది అని అంటున్నారు.

coincidence in these 4 pawan kalyan movies

భీమ్లా నాయక్ అనే ఒక గిరిజన ఎస్సై పాత్ర చేశారు పవన్ కళ్యాణ్. ఒక ట్రైబల్ రోల్ చేయడం అనేది కాస్త స్పెషల్ గా ఉంది. పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర చేసిన నాలుగో సినిమా ఇది. అంతకుముందు కొమరం పులి, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించారు పవన్ కళ్యాణ్. కానీ గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన పాత్ర మాత్రం ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయే ఒక పాత్రగా నిలిచింది. ఆ పాత్రకి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది.

coincidence in these 4 pawan kalyan movies

కానీ ఒక సారి గమనిస్తే, పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటించిన రెండు సినిమాలు హిట్ అయితే, మరో రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకుల అంచనాలనీ తారుమారు చేసాయి. పవన్ కళ్యాణ్ మొదటి సారిగా పోలీస్ పాత్రలో నటించిన సినిమా కొమరరం పులి. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నటించిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్‌హిట్ అయింది. అలాగే తర్వాత మళ్లీ పోలీస్‌గా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆశించిన ఫలితం పొందలేదు. మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోలీస్‌గా నటించిన భీమ్లా నాయక్ సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

You may also like