కోల్గేట్, సంతూర్ యాడ్స్ లో కనిపించే ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?

కోల్గేట్, సంతూర్ యాడ్స్ లో కనిపించే ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?

by Mohana Priya

Ads

అడ్వర్టైజ్మెంట్ వచ్చేది రెండు నిమిషాలు అయినా కూడా అందులో నటించిన నటులు తొందరగా రిజిస్టర్ అవుతారు. వారిలో నిత్య ఒకరు. నిత్య పేరు వినగానే ఇప్పటికే మీలో చాలా మందికి ఆ పాప గుర్తొచ్చే ఉంటుంది. సంతూర్ అడ్వటైజ్మెంట్ మహేష్ బాబుతో కలిసి నటించింది నిత్య. తర్వాత కోల్గేట్ ఎడ్వర్టైజ్మెంట్ లో కూడా కనిపిస్తుంది.

Video Advertisement

తన పూర్తి పేరు నిత్య మోయల్. సంతూర్ అడ్వటైజ్మెంట్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో, తమిళంలో కార్తీతో, హిందీలో వరుణ్ ధావన్ తో రూపొందించారు. మూడింటిలోనూ నిత్య నటించింది. కోల్గేట్, సంతూర్ అడ్వటైజ్మెంట్స్ తో పాటు గుడ్ నైట్, అల్ట్రాటెక్ సిమెంట్, ఫోన్ పే, బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్, షారుక్ ఖాన్ తో కలిసి బైజూస్, సోను సూద్ నటించిన ఒక ఇంజన్ ఆయిల్ అడ్వటైజ్మెంట్ లో కూడా కనిపిస్తుంది నిత్య.

నిత్య తండ్రి పేరు హరీష్ మోయల్. తల్లి పేరు మీను మోయల్. హరీష్ ఒక ప్రముఖ సింగర్ ఇంకా యాక్టర్. నిత్య తమ్ముడి పేరు దేవ్ మోయల్. దేవ్ మోయల్ కూడా ఎన్నో అడ్వటైజ్మెంట్స్ లో నటించాడు. అందులో అమితాబ్ బచ్చన్ గారితో నటించిన అడ్వర్టైజ్మెంట్ ఒకటి. నిత్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఇంస్టాగ్రామ్ లో తనపై వచ్చిన మీమ్స్ ని నోటీస్ చేసి మీమ్స్ చేసినందుకు థాంక్యూ కూడా చెబుతుంది. యూట్యూబ్ లో నిత్య మోయల్ పేరుతో ఒక ఛానల్ కూడా ఉంది. అందులో నిత్య నటించిన అడ్వటైజ్మెంట్స్ తో పాటు తన కుటుంబంతో గడిపిన వీడియోలు కూడా ఉంటాయి.

 


End of Article

You may also like