జిల్లా కలెక్టర్ ని మాములు వ్యక్తి అనుకుంది ఆ అవ్వ..! చివరికి ఏమైందో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు!

జిల్లా కలెక్టర్ ని మాములు వ్యక్తి అనుకుంది ఆ అవ్వ..! చివరికి ఏమైందో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు!

by Sainath Gopi

చాల కాలంగా ఓ అవ్వ తనకు రావాల్సిన పింఛన్ కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంది,కొన్ని నెలలుగా ఆ అవ్వ తిరుగుతున్నా కావడం లేదు. చేసేదేంలేక ఆ అవ్వ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి మెట్లమీద కూర్చుంది. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముగించుకొని కార్యాలయానికి వచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహమ్మద్‌‌ అబ్దుల్‌‌ అజీం ,మంగమ్మను చూసి ఆప్యాయంగా పలకరించి, పెద్దమ్మా ఏం కావాలి,ఎందుకొచ్చారు అని అడిగాడు.

Video Advertisement

మాములు వ్యక్తిగా భావించిన అవ్వ “అయ్యా నా పేరు మంగమ్మ,నా వయసు 70 ఏళ్ళు ,రెండేండ్ల సుంది పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని వచ్చినా”ఆన్నది,అయితే ఆ అవ్వకు అయన ఎవరో తెలియదు.  మాములు వ్యక్తిగా భావించిన ఆ అవ్వ తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పింది..వెంటనే ఆ కలెక్టర్ డీఆర్‌డీవో పీడీ సుమతితో ఫోన్‌లో మాట్లాడి పింఛన్‌ మంజూరు చేయాలని ఆదేశించారు.ఎంతో ఓపికగా ఆమె సమస్య విన్నది కలెక్టర్ గారే అని తెలుసుకుని చివరికి అవ్వ ఆశ్చర్యపోయింది.

కలెక్టర్ మంచితనాన్ని మెచ్చుకొని అతనిని చల్లగా ఉండాలంటూ ఆశిర్వదించింది అవ్వ.ఈ సన్నివేశం బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.ఈ న్యూస్ లోకల్ మీడియాలో వైరల్ గా మారింది,మెట్లపై కూర్చొని వృద్ధురాలితో మాట్లాడుతున్నప్పటి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలెక్టర్ పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి కలెక్టర్ ప్రతి జిల్లాకు ఉండాలి అని కోరుకుంటున్నారు..తన హోదా ని మరిచిపోయి ఒక సాధారణ వ్యక్తి లాగా సహాయం చేసిన ఈ కలెక్టర్ ని మీరు కూడా అభినందిందండి,అందరికి షేర్ చేయండి.


You may also like