ప్రస్తుతం రష్మిక మందాన తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది. సరిలేరు నీకెవ్వరూ హిట్ అందుకుంది దూసుకుపోతున్న రష్మిక, నితిన్ తో జతకట్టి “భీష్మ” తో ఈ వారం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. రష్మిక కుక్క బిస్కెట్ తినింది అని నితిన్ పదే పదే చెప్పి విసిగించిన విషయం కూడా తెలిసిందే.

Video Advertisement

అయితే ఇప్పుడు తాజాగా రష్మిక మీద మరో వివాదాస్పద కామెంట్ వచ్చింది. అది చేసింది సాధారణ నెటిజెన్ కాదండోయి. ఏకంగా కలెక్టర్ గారే కామెంట్ పెట్టారు. రష్మిక తన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలకు ‘చించావ్‌ పో’ అని ట్విట్టర్‌లో కామెంట్ చేశారు జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి. అయితే ఇప్పుడు ఆ ట్వీట్ వివాదాస్పదంగా మారింది.

ఈ విషయం పై కలెక్టర్ రవి స్పందించారు. ఈ ట్వీట్ తాను చేసింది కాదని. ఎవరో తన అకౌంట్ హ్యాక్ చేశారని అన్నారు. దీని పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసానని చెప్పుకొచ్చారు.