197
Ads
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంకా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సీఏఏ కు అనుకూలంగా మధ్యప్రదేశ్ లో తాజాగా బీజేపీ కార్యకర్తలు చేపట్టిన మద్దతు ర్యాలీ హింసాత్మకంగా మారింది. దీనితో నిరసనకారులను అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మ పై బీజేపీ కార్యకర్తలు అసభ్యకరంగా ప్రవర్తించారు. విధుల్లో భాగంగా ఆమె ఆందోళనకారులను చెదరగొడుతున్న సమయంలో అడ్డుకుని జుట్టుపట్టి లాగారు. దీనితో రెచ్చిపోయిన డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మ జట్టుపట్టిలాగిన వారిని గుర్తించి చెంపచెళ్లుమనిపించింది.
Video Advertisement
End of Article