ఇండియా చైనా సరిహద్దు మధ్య గొడవ జరగడం. అందులో 20 మంది భారత దేశ సైనికులు వీరమరణం పొందటం. వాళ్లల్లో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ ఉండడం ఇదంతా ప్రస్తుతం భారత దేశమంతటా చర్చనీయాంశమైన అంశంగా మారింది. కానీ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని వార్తల ప్రకారం సంతోష్ మరణం కాల్పుల వల్ల జరిగింది కాదు అని తెలుస్తోంది.

Video Advertisement

అసలు గొడవ ఎలా మొదలైంది ?

కొన్నాళ్లుగా చైనా ఆర్మీ భారతదేశ భూగర్భంలో కి రావడానికి ప్రయత్నిస్తోంది. భారత్ ఆర్మీ వాళ్ళని అడ్డుకుంటోంది. ఇటీవల చైనా మరోసారి అలానే భారతదేశ సరిహద్దులు దాటి రావడానికి ప్రయత్నించింది. దాంతో భారత్ ఆర్మీ మధ్య చైనా ఆర్మీ మధ్య గొడవ మొదలైంది.ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం నుండి తోపులాట వరకు వెళ్ళింది. అసలే చీకటి. ఉష్ణోగ్రత కూడా మైనస్ డిగ్రీల లో ఉంది. మంచు కారణంగా ఎవరికీ ఏమీ సరిగా కనబడలేదు. దాంతో ఆ గొడవ లో కొంతమంది పక్కనే ఉన్న లోయలో పడిపోయారు.

గొడవ తర్వాత ఏమైంది ?

గొడవ సద్దుమణిగిన తర్వాత చూసుకుంటే భారత ఆర్మీ లో ఇద్దరు సైనికులు కనబడలేదు. ఆర్మీ వాళ్ళు ఆ లోయ ప్రదేశాన్ని అంతా వెతికారు. ఎంతోసేపు వెతకగా కొన ఊపిరితో ఉన్న సంతోష్ వాళ్ళకి కనిపించారు. చికిత్స అందించిన కూడా సంతోష్ బతకలేదు. సంతోష్ తో పాటు తమిళనాడుకు చెందిన పళని, ఉత్తరాఖండ్ కి చెందిన ఓజా ఈ ఘటనలో మృతి చెందారు. వీరితో పాటు ఆ గొడవలో గాయపడిన దాదాపు 20 మంది భారతీయ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

చైనా సైనికుల పరిస్థితి ఏంటి ?

ఈ విషయంపై చైనా మాట్లాడుతూ భారతదేశ సైనికులు కూడా తమ బార్డర్ని దాటేందుకు ప్రయత్నం చేశారని, అలా చేసినప్పుడు చైనా ఆర్మీ వాళ్ళని అడ్డుకుందని చెప్పారు. ఆ గొడవలో చైనా ఆర్మీ వాళ్లకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది చైనా సైనికులు మృతి చెందారు అని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను చైనా ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.

Watch Video

source: bbc