నిండా 6 సంవత్సరాలు… ఏం జరిగిందో కూడా తెలియదు..! కానీ ఇంతలోనే..?

నిండా 6 సంవత్సరాలు… ఏం జరిగిందో కూడా తెలియదు..! కానీ ఇంతలోనే..?

by kavitha

Ads

జమ్ము కశ్మీర్‌లో టెర్రరిస్టులను ఏరివేసే క్రమంలో ముగ్గురు సైనికులు వీర మరణం పొందారు. వారి భౌతిక కాయాలను ఆ సైనికుల స్వగ్రామాలకు పంపించారు. ఈ క్రమంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌ యొక్క భౌతిక కాయాన్ని ఆయన సొంత గ్రామంకు తరలించారు.

Video Advertisement

కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌ యొక్క భౌతిక కాయాన్ని చూడడానికి వారి బంధువులు, గ్రామస్థులు, ఇతర గ్రామాల నుండి ప్రజలి భారీగా వచ్చారు. అశ్రు నాయనాల మధ్య కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌  అంత్యక్రియలు జరిగాయి. అయితే వీటన్నింటి మధ్య ఆయన ఆరేళ్ళ కొడుకు చేసిన పనికి అక్కడ ఉన్నవారంత కంటతడిపెట్టుకున్నారు.
19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా 41 సంవత్సరాల కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ వర్క్ చేస్తున్నారు. బుధవారం నాడు జమ్మూ కశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో రావడంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ హుమాయూన్, మేజర్ ఆశిష్ ధోంచక్ మరణించారు.
ముగ్గురు అమర వీరుల భౌతిక కాయాలను వారి స్వగ్రామలకు తరలించారు. ఈ క్రమంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌ భౌతిక కాయాన్ని పంజాబ్‌ రాష్ట్రంలోని మల్లాన్‌పూర్‌ కు తరలించారు. ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు వచ్చారు. కన్నిటితో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌ అంతిమ సంస్కారాలను జరిపించారు. అయితే ఆయన భౌతిక కాయం వద్ద చోటు చేసుకున్న ఒక సన్నివేశం అక్కడ ఉన్న వారి మనసులను కలిచివేసింది.
కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌ ఆరేళ్ళ కుమారుడు కబీర్ ఆర్మీ డ్రెస్ వేసుకుని, కనిపించాడు. అక్కడ ఏం జరిగిందో అర్ధం కానీ చిన్న వయసులో ఉన్న ఆ బాబు తన నాన్న భౌతిక కాయానికి జై హింద్‌ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. అన్న సెల్యూట్ చేయడం చూసిన ఆ బాబు చెల్లెలు రెండేళ్ల పాప కూడా సెల్యూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: ఎవరు ఈ కందుల జాహ్నవి..? అసలు ఆ రోజు అమెరికాలో ఏం జరిగిందంటే..?


End of Article

You may also like